AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMart Bag Trick: డిమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ బ్యాగ్‌ ట్రిక్ మీకు తెలుసా.. వెంటనే రీఫండ్..!

DMart Bag Trick: డిమార్ట్‌లో కొనుగోలు చేసిన బ్యాగ్‌కు సంబంధించిన డబ్బులను తిరిగి పొందే ఒక సులభమైన మార్గం ఉంది. అయితే బిల్లు మాత్రం భద్రంగా ఉంచుకోవాలి. మీరు డిమార్ట్‌లో షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్‌తో పాటు తీసుకున్న బిల్లును ఒక వారం రోజుల పాటు భద్రంగా ఉంచుకోవాలి..

DMart Bag Trick: డిమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఈ బ్యాగ్‌ ట్రిక్ మీకు తెలుసా.. వెంటనే రీఫండ్..!
Dmart Bag Trick
Subhash Goud
|

Updated on: Oct 23, 2026 | 10:27 AM

Share

DMart Bag Trick: సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేసేటప్పుడు బిల్లుతో పాటు వస్తువులను ఇంటికి తీసుకెళ్లేందుకు బ్యాగ్ కూడా అవసరమవుతుంది. అయితే DMartకు వెళ్లేవారిలో చాలామందికి బ్యాగుల విషయంలో కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. సాధారణంగా సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేసేవారు తమకు అవసరమైన క్యారీ బ్యాగ్‌ తీసుకెళ్లడం లేదా స్టోర్‌లో అందుబాటులో ఉన్న బ్యాగ్‌ను కొనుగోలు చేయడం వంటి పద్ధతులను అనుసరిస్తుంటారు. మళ్లీ వాడుకునే క్లాత్ బ్యాగ్‌ను తీసుకెళ్లడం వల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

మనం సాధారణంగా డిమార్ట్‌కి (DMart) వెళ్తే ఎన్నో రకాల వస్తువులు కొనుగోలు చేస్తాం. అయితే వాటిని మోసుకెళ్లడానికి లేదా ఇంటికి తెచ్చుకోవడానికి డిమార్ట్ బ్యాగ్స్ కొనుగోలు చేస్తుంటాం. చాలా మందికి బ్యాగులపై పెట్టే ఆ డబ్బులు వృథా అవుతున్నాయనిపిస్తుంది. అయితే ఆ బ్యాగ్ డబ్బులను తిరిగి వెనక్కి తీసుకోవచ్చనే అద్భుతమైన విషయం మీలో ఎంతమందికి తెలుసు?

ట్రిక్ ఏంటి? ఎలా పని చేస్తుంది?

డిమార్ట్‌లో కొనుగోలు చేసిన బ్యాగ్‌కు సంబంధించిన డబ్బులను తిరిగి పొందే ఒక సులభమైన మార్గం ఉంది. అయితే బిల్లు మాత్రం భద్రంగా ఉంచుకోవాలి. మీరు డిమార్ట్‌లో షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్‌తో పాటు తీసుకున్న బిల్లును ఒక వారం రోజుల పాటు భద్రంగా ఉంచుకోవాలి. ఆ వారం రోజుల్లో ఎప్పుడైనా మీరు ఆ డిమార్ట్ స్టోర్‌కి వెళ్లి, కస్టమర్ కేర్ (Customer Care) దగ్గర ఆ బ్యాగ్‌ను, దాని బిల్లును చూపించి తిరిగి ఇచ్చేయవచ్చు. కస్టమర్ కేర్ సిబ్బంది ఆ బ్యాగ్ విలువైన మొత్తాన్ని మీకు తిరిగి (Refund) చెల్లిస్తారు. ప్రతి డిమార్ట్‌లోనూ ప్రత్యేకంగా కస్టమర్ కేర్ ఉంటుంది. అక్కడికి వెళ్లి మీరు రీఫండ్‌ పొందవచ్చు. ఇకపై మీరు డిమార్ట్‌లో షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయని ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. ఈ చిన్న ట్రిక్‌తో మీ డబ్బులను సులభంగా ఆదా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price: ధంతేరస్, దీపావళికి ముందే తగ్గుతున్న పసిడి, వెండి ధరలు.. కొనుగోలుకు ఇది మంచి సమయమేనా?

ఇది కూడా చదవండి: Indian Railways: భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం.. 4,000 కిలోమీటర్లు, 75 గంటలు.. అద్భుత దృశ్యాలివే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us