AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ బరితెగిస్తున్న డ్రాగన్.. అరుణాచల్ సరిహద్దులో ఉద్రిక్తత.. ఐటీబీపీ డీజీ కీలక ప్రకటన!

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనా సైనికులతో పలుచోట్ల ఘర్షణలు కొనసాగుతున్నట్లు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ వెల్లడించారు. ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఐటీబీపీ ఉన్నతాధికారి నుంచి వచ్చిన తొలి అధికారిక నిర్ధారణగా ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మళ్లీ బరితెగిస్తున్న డ్రాగన్.. అరుణాచల్ సరిహద్దులో ఉద్రిక్తత.. ఐటీబీపీ డీజీ కీలక ప్రకటన!
India China Border Tensions
Balaraju Goud
|

Updated on: Oct 23, 2026 | 10:15 AM

Share

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి చైనా సైనికులతో పలుచోట్ల ఘర్షణలు కొనసాగుతున్నట్లు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ కపూర్ వెల్లడించారు. ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఐటీబీపీ ఉన్నతాధికారి నుంచి వచ్చిన తొలి అధికారిక నిర్ధారణగా ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఐటీబీపీ సిబ్బందికి నిర్వహించిన వార్షిక సన్మాన కార్యక్రమంలో కపూర్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయని, అవి ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే, ఈ ఘర్షణలు ఎక్కడ జరిగాయి? వాటికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఇరువైపులా ఎలాంటి నష్టం జరిగింది? అనే వివరాలను ఆయన వెల్లడించలేదు.

ఈ సందర్భంగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఐటీబీపీ సిబ్బంది పనితీరును డీజీ ప్రశంసించారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన శౌర్య కమాండోలు ఘర్షణల సమయంలో అసాధారణ ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. సరిహద్దు భద్రతలో వారు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఐటీబీపీని తొలుత పర్వత ప్రాంతాల్లో గెరిల్లా తరహా కార్యకలాపాల కోసం ఏర్పాటు చేశారని కపూర్ గుర్తుచేశారు. 2004లో చైనా సరిహద్దు వెంబడి రక్షణ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. దళం తన ప్రాథమిక విధులపై దృష్టి కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు.

అరుణాచల్ సరిహద్దులో ఘర్షణలు కొనసాగుతున్నాయన్న ప్రకటనతో సరిహద్దు భద్రతపై ఆసక్తి పెరిగింది. అయితే, ఘటనల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us