AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన వైరస్‌ సోకి వ్యక్తి మృతి .. ఏంటి ఈ షమొండా వైరస్‌?

పశువులకు సోకే షమొండా వైరస్‌ ఇప్పుడు మనుషుల్లోనూ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. షమొండా వైరస్‌ ప్రధానంగా ఈగల ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకి ఫ్రాన్స్‌లో ఇప్పుడు ఓ వ్యక్తి మృతి చెందడం ప్రపంచంలోనే తొలిసారి. తూర్పు ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ప్రారంభంలో పశువుల్లో వైరస్‌ వ్యాప్తి నమోదైంది. అతనికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం, షమొండా వైరస్‌తో అతని మెదడులో సమస్యలు రావడం గుర్తించారు.

అరుదైన వైరస్‌ సోకి వ్యక్తి మృతి .. ఏంటి ఈ షమొండా వైరస్‌?
France Reports First Ever Case Of Human Shamonda Virus 1 Dead
Sharada V
|

Updated on: Oct 23, 2026 | 8:58 AM

Share

పశువులకు సోకే షమొండా వైరస్‌ ఇప్పుడు మనుషుల్లోనూ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. షమొండా వైరస్‌ ప్రధానంగా ఈగల ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకి ఫ్రాన్స్‌లో ఇప్పుడు ఓ  వ్యక్తి మృతి చెందడం ప్రపంచంలోనే తొలిసారి. తూర్పు ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ప్రారంభంలో పశువుల్లో వైరస్‌ వ్యాప్తి నమోదైంది. అతనికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం, షమొండా వైరస్‌తో అతని మెదడులో సమస్యలు రావడం గుర్తించారు.

తొలిసారిగా ఎక్కడ గుర్తించారు?

షమొండా వైరస్‌ను 1965లో నైజీరియాలోని పశువుల్లో తొలిసారిగా గుర్తించారు. 2026 అక్టోబర్‌ నాటికి పశువుల పెంపకం ఎక్కువగా ఉన్న యూరప్‌ దేశాలైన ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, ఐర్లాండ్ లో ఈ వైరస్‌ కేసులు నమోదయ్యాయి. షమొండా వైరస్‌ ప్రధానంగా సన్నని ఈగలను పోలిన మిడ్జ్‌ల కాటు ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి తొలిసారి వైరస్‌ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్‌తో మృతి చెందిన తొలి వ్యక్తి అప్పటికే తీవ్ర అనారోగ్యంతో లియోన్‌ నగర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం, షమొండా వైరస్‌తో అతని మెదడులో సమస్యలు రావడం గుర్తించారు.

పశువులకు ఎంత ప్రమాదం?

షమొండా వైరస్‌ ప్రధానంగా పశువులను ప్రభావితం చేస్తుంది. వైరస్‌ సోకిన జంతువుల్లో జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. పశువులకు గర్భస్రావం కావడం, పిండం ఎదుగుదలలో లోపాలు, గుర్రాల్లో నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (WOAH) తెలిపింది.

మనుషులకు ఎలా సోకుతుంది?

షమొండా వైరస్‌ ప్రధానంగా సన్నని ఈగలను పోలిన మిడ్జ్‌ల కాటు ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకి ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి మృతి చెందడం ప్రపంచంలోనే తొలిసారి. తూర్పు ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ప్రారంభంలో పశువుల్లో వైరస్‌ వ్యాప్తి నమోదైంది. వైరస్‌తో మృతి చెందిన తొలి వ్యక్తి అప్పటికే తీవ్ర అనారోగ్యంతో లియోన్‌ నగర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందనీ షమొండా వైరస్‌తో అతని మెదడులో సమస్యలు తలెత్తినట్లు వైద్యులు నిర్థారించారు.

ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందా?

ఫ్రాన్స్‌లో నమోదైన ఈ ఘటనతో షమొండా వైరస్‌ మనుషుల్లోనూ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని బయటపడింది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నవారిపై ఈ వైరస్‌ ప్రభావం చూపుతుందని తేలింది. వైరస్‌ వ్యాప్తి చెంది మనుషులకు సోకే అవకాశాలపై మరింత దర్యాప్తు జరగాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

Follow Us