మర్యాదగా ఆ ఫోటోలు డిలీట్ చేయండి.. వార్నింగ్ ఇచ్చిన మృణాల్ 

4  August   2026

Pic credit - Instagram

Rajeev 

 సినిమా ఇండస్ట్రీలో డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు పెద్దగా సమస్యగా మారిన విషయం తెలిసిందే. 

గతంలో కొంతంమంది స్టార్ హీరోయిన్స్ ఫోటోలను ఫోటోలను మార్చి కొందరు అసభ్యకర పోస్ట్ లు చేశారు.

తాజాగా అందాల భామ మృణాల్ ఠాకూర్ డీప్ ఫేక్ బారినపడింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

డీప్ ఫేక్ ఫోటోలు, మార్ఫింగ్‌ ఫొటోలు దర్శనమివ్వడంతో మృణాల్ ఠాకూర్  అభిమానులు షాక్ అవుతున్నారు.

అయితే ఈ డీప్ ఫేక్ ఫోటోల పై మృణాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటిని తొలగించాలని సీరియస్ అయ్యింది.

నా డీప్‌ఫేక్‌ ఫొటోలను క్రియేట్‌ చేసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.

తక్షణమే వాటిని తొలగించండి. లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ మృణాల్ వార్నింగ్ ఇచ్చింది.