AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kushboo : జిమ్ లేకుండానే 30 కిలలో బరువు తగ్గా.. రోజూ నేను చేసిన పని అదే.. హీరోయిన్ ఖుష్బూ..

నటి కుష్బూ తన మూడు సంవత్సరాల బరువు తగ్గే ప్రయాణాన్ని, 32 కేజీలు తగ్గడం వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు. జిమ్ కాకుండా నడక, గ్లూటెన్ లేని ఆహారం, జంక్ ఫుడ్ తగ్గించడం వంటి తన వ్యక్తిగత పద్ధతులను వివరించారు. చీరలపై తనకున్న ప్రేమ, కుటుంబం పట్ల ఆమె రక్షణాత్మక స్వభావం, భర్త సుందర్ సి సినీ ప్రయాణం గురించి కూడా తెలిపారు.

Kushboo : జిమ్ లేకుండానే 30 కిలలో బరువు తగ్గా.. రోజూ నేను చేసిన పని అదే.. హీరోయిన్ ఖుష్బూ..
Khusbhoo
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2026 | 3:12 PM

Share

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది ఖుష్బూ. ఇటీవల తన వెయిట్ లాస్ లుక్కుతో అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో , తన అద్భుతమైన వ్యక్తిగత , వృత్తిపరమైన ప్రయాణాల గురించి పంచుకుంటూ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, ఆమె 32 కిలోల బరువు తగ్గుదల, దాని వెనుక ఉన్న జీవనశైలి మార్పులు, ఫ్యాషన్ అభిరుచులు, కుటుంబం పట్ల ఆమెకున్న అనుబంధం, భర్త సుందర్ సి సినీ కెరీర్‌పై తన అభిప్రాయాలను వివరించారు. తన బరువు తగ్గుదలను ఒక్కసారిగా జరిగిన పరిణామంగా కాకుండా, మూడేళ్ల సుదీర్ఘ ప్రక్రియగా తెలిపారు. ఈ కాలంలో ఆమె 32 కిలోల బరువు తగ్గారు. ఫ్యాడ్ డైట్‌లకు దూరంగా ఉండి, తన శరీరానికి ఏమి అవసరమో అర్థం చేసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టానని చెప్పారు. జిమ్‌కు వెళ్లడానికి ఆసక్తి చూపని ఖుష్బూ, నడకను తన వ్యాయామంగా ఎంచుకున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 45 నిమిషాల చొప్పున చురుకుగా నడుస్తారు. ఆహార నియంత్రణలో భాగంగా, ఆమె జంక్ ఫుడ్‌ను గణనీయంగా తగ్గించారు. ముఖ్యంగా మైదా వంటి గ్లూటెన్ ఉత్పత్తులను పూర్తిగా మానేశారు. తీపి పట్ల ఆమెకు ఇష్టం ఉన్నప్పటికీ, చాక్లెట్లపై పెద్దగా ఆసక్తి లేదని, ఐస్‌క్రీంలు , భారతీయ స్వీట్‌లను ఇష్టపడతానని పేర్కొన్నారు. “ఒకసారి మీ శరీరం ఏమి కోరుకుంటుందో అర్థం చేసుకుంటే, దాన్ని నిర్వహించడం చాలా సులభం” అని ఆమె తన విజయ రహస్యాన్ని సూచించారు.

అలాగే చీరల పట్ల తనకున్న అమితమైన ప్రేమను వ్యక్తపరిచారు. ఆమె వందల సంఖ్యలో చీరలను కలిగి ఉన్నారని, కొన్నిసార్లు 3000 రూపాయల చీరలు 20,000 విలువ చేసే చీరల వలె కనిపించేలా తన ఎంపిక ఉంటుందని చెప్పారు. ఖరీదైన చీరలకే పరిమితం కాకుండా, 200 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు చీరలను కొనుగోలు చేస్తానని వెల్లడించారు. చీరలను మార్చి మార్చి కట్టుకోకుండా, బ్లౌజ్‌లను మార్చడం ద్వారా కొత్త లుక్‌ను సృష్టిస్తానని తెలిపారు. నగల విషయంలో, ఆమె పెద్ద చెవిపోగులను ఇష్టపడతారు , మెడలో ఏమీ ధరించడానికి ఇష్టపడరు, పెద్ద చెవిపోగులు తన ముఖానికి బాగా సరిపోతాయని పేర్కొన్నారు.

కుష్బూను “ఐరన్ లేడీ” అని పిలిచినప్పటికీ, ఆమె కుటుంబం విషయానికి వస్తే చాలా సున్నితంగా, రక్షణాత్మకంగా ఉంటానని చెప్పారు. “నా పిల్లల గురించి లేదా నా కుటుంబం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నేను గాయపడిన పులిలా మారుతాను” అని అన్నారు. ట్రోలింగ్‌పై స్పందిస్తూ, అనామకులను పట్టించుకోనని, అయితే హద్దులు దాటితే కచ్చితంగా స్పందిస్తానని చెప్పారు. తన పిల్లలు, పెద్ద కుమార్తె తన లాగే కనిపిస్తుంది కానీ ఆమె మనస్తత్వం తన తండ్రి సుందర్ సి లాగా రిజర్వ్‌డ్‌గా ఉంటుందని, చిన్న కుమార్తె తండ్రి లాగా కనిపించినా, తనలాగే చాలా సరదాగా, అవుట్‌గోయింగ్‌గా ఉంటుందని వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us