AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: గురు మౌఢ్య త్యాగంతో మహర్దశ పట్టే రాశులివే..! వారికి ఆకస్మిక ధనలాభం

Telugu Astrology: ఆగస్టు 12తో గురు మౌఢ్యం ముగియడంతో కొన్ని రాశుల వారికి శుభకాలం ప్రారంభం కానుంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి అక్టోబర్ 31 వరకు ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, సంతానం, శుభకార్యాల విషయంలో అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Astrology: గురు మౌఢ్య త్యాగంతో మహర్దశ పట్టే రాశులివే..! వారికి ఆకస్మిక ధనలాభం
Guru Moudhyam Ends
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 05, 2026 | 4:18 PM

Share

కర్కాటక రాశిలో గురు, రవుల యుతి వల్ల జూలై 15న ఏర్పడిన గురు మౌఢ్యం ఈ నెల(ఆగస్టు) 12తో తొలగిపోతోంది. కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల గురువుకు పెద్దగా గురు మౌఢ్య దోషం అంటకపోవచ్చు. కానీ, ఆ కొద్దిపాటి దోషం కూడా తొలగిపోవడం వల్ల కొన్ని రాశుల వారు తప్పకుండా ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి అక్టోబర్ 31 వరకు జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఏ ఆటంకాలు, అవరోధాలు లేకుండా వీరి ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. గురువుకు ఉన్న ధన, గృహ, సంతాన, శుభకార్యాల కారకత్వాలు పూర్తి స్థాయిలో అనుభవానికి వస్తాయి.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం వల్ల తప్ప కుండా సమగ్ర పురోగతి ఉంటుంది. మూఢమి దోషం పూర్తిగా తొలగిపోవడంతో గురు బలం పెరిగి ఊహించని విధంగా ధన యోగాలు పడతాయి. అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు అప్రయత్నంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి.
  2. మిథునం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో ఉన్న గురువు మౌఢ్యమి నుంచి బయటపడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందు తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న గురువు మౌఢ్యమి నుంచి విముక్తి పొందిన దగ్గర నుంచి ఈ రాశివారి దశ తిరగడం ప్రారంభం అవుతుంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్ప డుతుంది. పిత్రార్జితం సంక్రమిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా తరచూ విదేశాలకు వెళ్ల డం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సొంత ఇంటి యోగం పడుతుంది.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు మౌఢ్య దోషం నుంచి పూర్తిగా బయటప డడం వల్ల ఈ రాశివారికి ఆస్తి లాభం, సొంత ఇంటి యోగం కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. శుభ కార్యాలు జరుగుతాయి.. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి ఖాయం కావడం జరుగుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో ధన కారకుడు గురువుకు మరింతగా బలం పెరగడం వల్ల రాజ పూజ్యాలు కలుగుతాయి. రాజభోగాలు అనుభవిస్తారు. ఏ రంగంలో ఉన్నా విశేషమైన పురోగతి ఉంటుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  7. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు మౌఢ్య దోషం నుంచి బయటపడడం వల్ల శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభ, శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

Also Read: గ్రహాల అనుకూలత.. సెప్టెంబర్ చివరికల్లా వీరు జీవితంలో ఓ మెట్టు పైకి..!

గమనిక: ఈ కథనం పూర్తిగా జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహ సంచారాలు, రాశి ఫలితాల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో పేర్కొన్న అంశాలు వ్యక్తిగత విశ్వాసాలు, సంప్రదాయ జ్యోతిష్య సిద్ధాంతాలపై ఆధారపడినవి మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవాలుగా పరిగణించరాదు. వ్యక్తిగత అనుభవాలు, జన్మకుండలి, దశలు, గోచారాలు వంటి అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు.

Follow Us