Astrology 2026: గ్రహాల అనుకూలత.. సెప్టెంబర్ చివరికల్లా వీరు జీవితంలో ఓ మెట్టు పైకి..!
Telugu Astrology: ప్రస్తుతం ఆరు రాశులకు దాదాపు అయిదు గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నాయి. ఈ అనుకూల గ్రహ సంచారం ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి సెప్టెంబర్ చివరి వరకు అనేక శుభ యోగాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. ఉద్యోగం, ఆర్థిక పురోగతి, వివాహం, విదేశీ అవకాశాలు, కొత్త ప్రారంభాల్లో అనుకూల ఫలితాలు లభించే కాలంగా దీనిని భావిస్తున్నారు.

సాధారణంగా గ్రహాలు మారినప్పుడు కొన్ని రాశులు అత్యధికంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో ఈ రాశుల వారికి తప్పకుండా శుభ ఫలితాలు అందుతాయి. ప్రస్తుతం ఆరు రాశులకు అయిదు గ్రహాల వరకు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఆరు రాశులుః మేషం, వృషభం, కర్కాటకం, తుల, మకరం, మీనం. వీరికి సెప్టెంబర్ చివరిలోగా తప్పకుండా కొన్ని శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. అధికార యోగం, ధన యోగం, విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమల్లో వీరికి ఇది కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ రాశులవారు కొత్త ప్రయత్నాలు చేపట్టడం, కొత్త కార్యక్రమాలు చేపట్టడం మంచిది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి.
- మేషం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉండడంతో గురు, బుధ, రవి, రాహువులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో పాటు శని, రాహువు, బుధుడు, రవి అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు అందడంతో పాటు ఆస్తి కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, వ్యాపారాల్లో లాభాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో దూసుకుపోతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంటా బయటా ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి.
- కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, శని, బుధ, రవి, చంద్రులు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అనేక వైపుల నుంచి కూడా సంపద పెరిగే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
- తుల: ఈ రాశికి రాహు కేతువులతో పాటు, గురు, బుధ, రవి, శనుల అనుకూల సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో అదనపు రాబడి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. నిరుద్యోగులు ఊహించని జీతభత్యాలతో మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి రాశ్యధిపతి శనితో పాటు, గురు, రవి, బుధ, శుక్రుల అనుకూలత బాగా ఎక్కువగా ఉన్నందువల్ల జీవితం ఓ నెలన్నర పాటు నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. అనేక విధాలుగా విశేషంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఊహించని ధన యోగం పడుతుంది. అదనపు ఆదాయానికి, రాబడికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
- మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ పట్టడంతో పాటు, రవి, బుధ, కుజ, చంద్రుల అను కూలత వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం తగ్గడంతోపాటు శుభ యోగాలు పడతాయి. ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మెరుగుపడతాయి. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా, ఆదాయ ప్రయత్నమైనా సఫలమవుతుంది. సంపద వృద్ది చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కలుగుతుంది.
Also Read: ఆగస్టు నెలంతా వీరికి అదృష్ట దేవత వరాలు! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
Disclaimer:ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య సమాచారం సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రంలోని విశ్వాసాలు, నిపుణుల ఆధారంగా అందించబడింది. ఇవి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశాలు మాత్రమే. ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గ్రహస్థితులు, ఇతర అంశాలపై ఆధారపడి మారవచ్చు. ఈ సమాచారాన్ని శాస్త్రీయంగా నిర్ధారిత వాస్తవంగా లేదా ఖచ్చితమైన ఫలితాల హామీగా పరిగణించరాదు.



