Shubh Yoga: అబ్బబ్బా.. ఆగస్టులో వారికి కలలో కూడా ఊహించని శుభాలు..!
Telugu Astrology: ఆగస్టు 2026లో శుక్రుడు ఆగస్టు 2న కన్యా రాశిలోకి, కుజుడు ఆగస్టు 3న మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల కీలక గ్రహ సంచారాలు చోటుచేసుకుంటున్నాయి. పరస్పర శత్రు గ్రహాలైన శుక్రుడు, కుజుడు రాశులు మారడం వల్ల వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పురోగతి, వ్యక్తిగత జీవితంలో అనుకోని శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ఈ నెల(ఆగస్టు) 2న శుక్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి మారుతుండగా, 3న కుజుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారడం జరుగుతోంది. పరస్పర విరుద్ధ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు, బద్ధ శత్రువులైన ఈ రెండు గ్రహాలు రాశులు మారడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆగస్టు నెలంతా వీరి జీవితాల్లో ఆకస్మిక మార్పులు జరగడానికి, అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశులవారి జీవితాలు సానుకూల మలుపులు తిరిగే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి ధన స్థానంలో కుజుడు, పంచమ స్థానంలోకి రాశ్యధిపతి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఆక స్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఊహించని మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు అంచనాలను మించుతాయి. ఆర్థికంగా ఎన్నడూ లేని స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త నైపుణ్యాలు అలవడతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరు గుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
- మిథునం: ఈ రాశిలోకి కుజుడు, చతుర్థ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి ఆస్తిపాస్తుల సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటియోగం పడుతుంది. ఉద్యోగులు తమ సొంత ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. పదోన్నతులు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాల్లో కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు వసూలవుతాయి.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలోకి కుజుడు, ధన స్థానంలోకి శుక్రుడు ప్రవేశించడంవల్ల ఈ రాశివారికి ఊహించని స్థాయిలో ఆదాయ వృద్ధి ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు అనూ హ్యంగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనా లను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- కన్య: ఈ రాశిలోకి శుక్రుడు, దశమ స్థానంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల కలలో కూడా ఊహించని రాజయోగాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగం రావడం, ఆదాయం వృద్ధి చెందడం, యాత్రలు చేయడం, పిల్లలు వృద్ధిలోకి రావడం, శుభవార్తలు ఎక్కువగావినడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్రయత్నాలు చేపడతారు. ఆస్తి వివాదాం ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. అనారోగ్యం నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది.
- వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు అష్టమ స్థానమైన మిథునంలో ప్రవేశించడం, లాభ స్థానంలో శుక్రుడు సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారి జీవితంలో ఒకటికి రెండుసార్లు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే తగిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో కుజుడు, భాగ్య స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారు ఘన విజయాలు సాధిస్తారు. వ్యాపా రాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది.
గమనిక: ఈ కథనంలో పొందుపరిచిన రాశిఫలాలు పంచాంగం, గ్రహస్థితులు, సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించబడినవి. ఇవి సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వ్యక్తిగత జీవితంలో తీసుకునే ఆర్థిక, వైద్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లేదా ఇతర కీలక నిర్ణయాలకు వీటిని ఏకైక ఆధారంగా పరిగణించరాదు. పాఠకులు అవసరమైతే సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.



