AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar: బుధుడి అనుగ్రహంతో ఇక ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే..!

Mercury Transit in Cancer: ఆగస్టు 6 నుంచి 22 వరకు బుధుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. ఈ గోచారం ప్రభావంతో మేషం, మిథునం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి వ్యక్తిగత పురోగతి, కెరీర్, ఆర్థిక విషయాలు, సామాజిక గుర్తింపులో అనుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Budh Gochar: బుధుడి అనుగ్రహంతో ఇక ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
Budh Gochar
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 04, 2026 | 3:55 PM

Share

ప్రస్తుతం స్వక్షేత్రమైన మిథున రాశిలో సంచారం చేస్తున్న బుధ గ్రహం ఈ నెల (ఆగస్టు) 6న కర్కాటక రాశిలో ప్రవేశించి, ఈ నెల 22 వరకు అదే రాశిలో కొనసాగుతుంది. కర్కాటక రాశిలో బుధుడు ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి వ్యక్తిగత పురోగతి మీదకు దృష్టి మళ్లుతుంది. జీవితానికి సంబంధించిన కీలక విషయాల్లో పురోగతి, అభివృద్ధి సాధించడానికి సంబంధించి ప్లాన్లు వేస్తారు. ఇతరులతో ఆలోచనలు సాగిస్తారు. సామాజికంగా బంధుమిత్రుల కంటే ఒక అడుగు ముందుండడానికి ప్రయత్నాలు సాగిస్తారు. మేషం, మిథునం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి అనుకూలతలు బాగా పెరుగుతాయి.

మేష రాశి

ఈ రాశికి చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్న బుధుడి వల్ల ఈ రాశివారికి సొంత ఇల్లు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలన్న ఆశయం కలుగుతుంది. చదువుల్లో మరింత పురోగతి సాధించాన్న తాపత్రయం విద్యార్థుల్లో బయలుదేరుతుంది. సేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందుతారు. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటిస్తారు. ఆస్తి వివాదాల్ని రాజీమార్గంలో పరిష్క రించు కోవడానికి ప్రయత్నాలు సాగిస్తారు. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ అవకాశాన్నీ జారవిడుచుకోరు.

మిథున రాశి

రాశినాథుడైన బుధుడు ధన స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ధనవృద్ధి మీద శ్రద్ధ పెరుగుతుంది. ఏదో విధంగా సంపన్నుడు కావాలన్న పట్టుదలతో అనేక మార్గాలను అనుసరించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు వీరికి బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆస్తిపాస్తుల వ్యవహారాల్ని చక్కబెడతారు. పెట్టుబడులు పెట్టడం మీద శ్రద్ధ పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.

ఇవి కూడా చదవండి

కన్యా రాశి

రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలన్న ఆశయం కలుగుతుంది. ఉద్యోగంలో నైపుణ్యాలను, ప్రతిభా పాటవాలను మరింతగా పెంచుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఎటువంటి అవకాశాన్నీ జారవిడుచుకోరు. అధికారులను పనితీరుతో ఆకట్టుకుని అందలాలు ఎక్కడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలన్న ఆశయం నెరవేరుతుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు.

తులా రాశి

ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన బుధుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో పైకి ఎదగడం మీదా, వృత్తి, వ్యాపారాలను లాభసాటిగా మార్చడం మీదా ఈ రాశివారి దృష్టి కేంద్రీకృతమవుతుంది. మరింత మంచి ఉద్యోగంలో మారడానికి ప్రయత్నాలు సాగించి సక్సెస్ అవుతారు. ఉద్యోగంలో ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది.

మకర రాశి

ఈ రాశికి సప్తమ స్థానంలో బుధ సంచారం వల్ల ఈ రాశివారు పట్టుదలగా ఆర్థిక పురోగతిని సాధిస్తారు. షేర్లు, స్టాకుల మీదే కాక వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టినూ, ఆర్థిక పురోగతి పొందుతారు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలను సానుకూలంగా పరిష్క రించుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మీన రాశి

ఈ రాశికి పంచమంలో బుధ సంచారం వల్ల జీవన శైలిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేపడ తారు. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా పురోగతి సాధించడానికి గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. ఆర్థిక, సామాజిక, ఉద్యోగ స్థితి ఇదివరకటి కంటే ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఆత్మ విశ్వాసం, చొరవ బాగా పెరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయి, జీవితంలో స్థిరపడతారు.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!