AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Blessings: చంద్రుడి కటాక్షం.. ఆ రాశుల వారికి అధికారం, ధన యోగాలు..!

Moon Transit 2026: ఆగస్టు 5 నుంచి 13 వరకు చంద్రుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో సంచరించనున్నాడు. దీంతో గజకేసరి యోగం, ఉచ్ఛ స్థితి, చంద్ర మంగళ యోగం వంటి శుభ యోగాలను సృష్టించనున్నాడు. ఈ ప్రభావంతో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకర రాశుల వారికి రాజయోగం, ధనయోగం, ఉద్యోగం, ఆర్థిక పురోగతి వంటి అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

Moon Blessings: చంద్రుడి కటాక్షం.. ఆ రాశుల వారికి అధికారం, ధన యోగాలు..!
Moon Blessings
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 5:57 PM

Share

ఈ నెల (ఆగస్టు) 5 నుంచి 13వ తేదీ వరకు చంద్రుడు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో సంచారం చేయడం జరుగుతోంది. ఈ ఎనిమిది రోజుల్లో చంద్రుడు యోగదాయకుడుగా మారడం వల్ల కొన్ని రాశులకు కలలో కూడా ఊహించని శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది., మేషంలో ప్రవేశించినప్పుడు గజకేసరి యోగం, వృషభంలో ప్రవేశించినప్పుడు ఉచ్ఛ స్థితి, మిథునంలో ప్రవేశించినప్పుడు చంద్ర మంగళ యోగం, స్వక్షేత్రమైన కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మళ్లీ గజకేసరి యోగం ఏర్పడబోతున్నాయి.. దీనివల్ల మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులతో పాటు, తుల, మకర రాశుల వారికి కూడా రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి.

  1. మేషం: ఈ రాశివారికి ఈ ఎనిమిది రోజుల చంద్ర సంచారం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉండబోతోంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సత్ఫలితాలనిస్తుంది. ఆత్మవిశ్వాసం, మానసిక స్థయిర్యం వృద్ది చెందుతాయి. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. తల్లి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి.
  2. వృషభం: ఐశ్వర్య కారకుడైన చంద్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం అనేక మార్గాల్లో బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. సోదరులతో ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఎలాంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపట్టడానికి, వృత్తి, వ్యాపారాల్ని కొత్త పుంతలు తొక్కించడానికి సమయం అనుకూలంగా ఉంది.
  3. మిథునం: ధన స్థానాధిపతి అయిన చంద్రుడు ఈ రాశికి అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  4. కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు యోగదాయకంగా మారుతున్నందువల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.
  5. తుల: దశమాధిపతి చంద్రుడికి బలం పెరగడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు పెరగడం, అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు చేస్తారు. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది.. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  6. మకరం: చంద్రుడి అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఎవరితో ఎటువంటి విభేదాలున్నా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీ ఆలోచన లకు, నిర్ణయాలకు విలువ ఏర్పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పుణ్య క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా పురోగతి చెందడంతో పాటు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

Disclaimer:ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య సమాచారం సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్రంలోని విశ్వాసాలు, నిపుణుల ఆధారంగా అందించబడింది. ఇవి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశాలు మాత్రమే. ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గ్రహస్థితులు, ఇతర అంశాలపై ఆధారపడి మారవచ్చు. ఈ సమాచారాన్ని శాస్త్రీయంగా నిర్ధారిత వాస్తవంగా లేదా ఖచ్చితమైన ఫలితాల హామీగా పరిగణించరాదు.

Follow Us