AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Movie: బేబీ మూవీకి ఆ హీరోను తీసుకుందాం అనుకున్నా.. కానీ ఎలా మిస్సైందంటే.. డైరెక్టర్ సాయి రాజేష్..

బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ సాయి రాజేష్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఈసినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. అయితే ఈ సినిమాకు మరో హీరోను తీసుకుందామని అనుకున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.

Baby Movie: బేబీ మూవీకి ఆ హీరోను తీసుకుందాం అనుకున్నా.. కానీ ఎలా మిస్సైందంటే.. డైరెక్టర్ సాయి రాజేష్..
Baby Movie
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2026 | 2:51 PM

Share

దర్శకుడు సాయి రాజేష్ బేబీ చిత్రం సాధించిన అద్భుత విజయంతో తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రం తర్వాత తాను ఆర్థికంగా స్థిరపడి, గతంలో ఎన్నడూ లేని విధంగా మానసిక ప్రశాంతతను పొందినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఇది నా జీవితంలో మొట్టమొదటిసారి మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రజలు నన్ను నమ్ముతున్నారు. నా దగ్గర విషయం ఉందని, డబ్బులు వస్తాయని విశ్వసిస్తున్నారు” అని సాయి రాజేష్ అన్నారు. సాయి రాజేష్ కొబ్బరిమట్ట, కలర్ ఫోటో వంటి చిత్రాలను నిర్మించి విజయాలు అందుకున్నారు. కలర్ ఫోటో తనకు పేరు, డబ్బు రెండింటినీ తీసుకొచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే, తాను పరిచయం చేసిన సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం కెరీర్‌లో ఎదుర్కొంటున్న సవాళ్లపై సాయి రాజేష్ ఆందోళన వ్యక్తం చేశారు. “సంపూ నా దృష్టిలో ఒక హీరో. పరిశ్రమ ఒప్పుకోకపోయినా జనాలకు అతను ఒక కామెడీ హీరో. మామూలు కమెడియన్ కాదు” అని సాయి రాజేష్ స్పష్టం చేశారు. అయితే, పరిశ్రమలో అతనికి సరైన పాత్రలు లభించడం లేదని, హీరోగా మార్కెట్ లేకపోవడం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అతని ఇమేజ్ కారణంగా చిన్న పాత్రలు ఇవ్వడానికి నిర్మాతలు, దర్శకులు వెనుకాడటం వల్ల సంపూర్ణేష్ బాబు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. బేబీ చిత్రంలో కూడా సంపూర్ణేష్‌కి చిన్న పాత్ర ఇవ్వడం ఇష్టం లేక తాను ఇవ్వలేదని సాయి రాజేష్ పేర్కొన్నారు. “నేను అతన్ని హీరోగా పెట్టి రెండు సినిమాలు చేశాను. అలాంటి వ్యక్తిని చిన్న పాత్రలో చూస్తే అది నాకే అవమానం అనిపించి ఇవ్వలేదు” అని ఆయన అన్నారు.

సంపూర్ణేష్ బాబు అద్భుతమైన నటుడని సాయి రాజేష్ అన్నారు. కొబ్బరిమట్ట చిత్రంలో ఇంటర్వెల్ సన్నివేశంలో మూడున్నర నిమిషాల నిడివి గల ఒకే ఒక షాట్‌లో డైలాగ్‌ను చెప్పిన విధానాన్ని చెప్పుకొచ్చారు. బాలయ్య బాబు స్ఫూర్తితో సంపూర్ణేష్ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి డైలాగులు సాధన చేసేవాడని, అది నిజంగా వర్కవుట్ అయ్యిందని గుర్తు చేసుకున్నారు. అలాంటి నటుడికి సరైన గుర్తింపు లేకపోవడం తనకు బాధ కలిగిస్తోందని సాయి రాజేష్ చెప్పారు. సంపూర్ణేష్ బాబు కెరీర్‌కు మళ్లీ ఊతమిచ్చేందుకు, అతని ఇమేజ్‌ను మార్చేలా ఒక చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నానని అన్నారు.

“అతని కోసమే ఒక కథను రాసుకున్నాను. అతని కోసమే తీస్తాను, అతని కోసమే రిలీజ్ చేస్తాను” అని సాయి రాజేష్ తెలిపారు. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని, అయితే దర్శకత్వం వహించే అవకాశం లేదని, ఎందుకంటే ఇప్పటికే ఇతర ప్రాజెక్ట్‌లకు కమిట్ అయ్యానని వివరించారు. సంపూర్ణేష్ ఒక బ్రిలియంట్ ఆర్టిస్ట్ అని ప్రజలు నమ్మేలా చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us