కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి.. బిగ్ బాస్ బ్యూటీ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

05 August 2026

బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా విశేష ఆదరణ పొందిన నటి దివి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ మరికొన్ని చిత్రాలలో కీలక పాత్రల్లో నటించింది.

అయితే ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి.. హీరోయిన్ల డ్రెస్సింగ్, సోషల్ మీడియా ఎక్స్‌పోజింగ్ , ట్రోలింగ్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.

డ్రెస్సింగ్ వల్ల ఎదురయ్యే విమర్శలపై యాంకర్ అడిగిన ప్రశ్నకు దివి తనదైన శైలిలో బదులిచ్చింది. అలాగే తన డ్రెస్సింగ్ గురించి వెల్లడించింది.

నాకు నచ్చిన దుస్తులు ధరించడం నా హక్కు. నాకు సాంప్రదాయ దుస్తులు ఎంత ఇష్టమో, గ్లామరస్‌గా కనిపించడం కూడా అంతే ఇష్టం అని అన్నారు దివి.

నేను కత్తిలా ఉంటాను.. నా లుక్స్ చూపించుకోవడానికి సోషల్ మీడియానే సరైన వేదిక. ఇండస్ట్రీలో ముందస్తుగా అందం, లుక్స్ చూసే నటన గురించి మాట్లాడుతారు.

అందుకే నా లుక్స్  ప్రేక్షకులకు చూపించడం కోసం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను అని స్పష్టం చేసింది. దివి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

డ్రెస్సింగ్ ఆధారంగా ఒకరి వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయడం సరికాదని చెప్పిన దివి.. ఎక్కడికి వెళ్తున్నామో దానికి తగ్గట్టుగా దుస్తులు ధరించాలని సూచించింది.