750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్.. కట్‌చేస్తే.. ఇప్పుడిలా.. అసలేంజరిగింది?
అదో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే కర్మాగారం. 16 ఏళ్ల క్రితం నాటి ప్రధాని చేతుల మీదుగా హట్టహాసంగా ప్రారంభానికి సిద్ధమైన ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు ముందే మూతపడి దోపిడి దొంగలకు ఆదాయ వణరుగా మారింది. ఇంతకూ ఆ ప్రాజెక్ట్ ఏది.. ఎందుకు మూతపడిందనేగా మీ డౌట్! అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

రూ.6వేల కోట్లతో హట్టహాసంగా ప్రారంభానికి సిద్ధమైన ఓ భారీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ ముందే మూతపడింది. అదే NTPC, BHEL పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కర్మాగారం. 2010 సవంత్సరంలో రెండు పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం మన్నవరంలో ఈ అతిపెద్ద ప్రాజెక్ట్‌ను చేపట్టారు. రూ. 6 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతులు మీదుగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు.
దీంతో ఆ ప్రాంతంలోని భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. నిర్మాణ పనులు పూర్తయ్యాయి నెమ్మదిగా విద్యుత్ ఉపకరణాల తయారీ యంత్రాల ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. సుమారు 2,000 మందికి ఉపాది కల్పిస్తూ..500 మందికి పైగా అధికారులు కర్మాగారం పనులను పర్యవేక్షిస్తున్న తరుణంలో ప్రతికూల పరిస్థితులు కారణంగా ఒక్కసారిగా పరిశ్రమలో పనులన్ని ఆగిపోయాయి. దీంతో ఉత్పత్తి తగ్గిపోయింది. నిర్దిష్ట లక్ష్యానికి చేరుకోక మునుపే ఈ సంస్థ ఉనికి కోల్పోయింది. రాను రాను అధికారులు సైతం తగ్గుతూ రావడంతో 2025 అక్టోబర్ నుంచి ఉన్నత ఆశయంతో ప్రారంభించిన సంస్థ ప్రోత్సాహం కొరవడి మూతపడింది. ఇదే దొంగలకు వరంగా మారింది.
మూతపడ్డ NBPPL పరిశ్రమలోని రూ. కోట్ల విలువైన సంపదను, అధికారులు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కర్మాగారంలోని ఖదీదైన యంత్రాలకు భద్రత కరువైంది. ఇదే అదునుగా భావించిన దొంగలు పరిశ్రమలోని విలువైన యంత్రాలను కాజేయడం స్టార్ట్ చేశారు.ఈ వరుస చోరీలను గమనించిన స్థానికులు ఒకటి, రెండు సార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. కొన్ని రోజుల్లోనే ఫ్యాబ్రికేషన్ బ్లాక్‌లోని అన్ని యంత్రాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
ఈ బ్లాక్‌లో ఉన్న సుమారు 50 అత్యధిక బిల్డింగ్ యంత్రాలను ధ్వంసం చేసి వాటిలో కాఫర్‌ను ఎత్తుకెళ్లారు. ఇందులోని ఒక్కో యంత్రం ఖరీదు రూ.5 లక్షలకు వరకు ఉంటుంది. ఇంత దోచుకున్నా.. ఈ దొంగల ఆశ మాత్రం చావలేదు. పరిపాలనా భవనాన్ని సైతం ధ్వంసం చేసి అందులో ఉన్న BPPL కంపెనీకి చెందిన 100కు పైగా కంప్యూటర్లు, 35కు పైగా ఏసీలు, జిరాక్స్ మిషన్లు ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కాజేశారు. ఏం చేసినా పట్టించుకునే నాదుడే లేకపోవడంతో ఇది దొంగలకు అలుసుగా మారిపోయింది.
ఉత్పత్తి ప్రారంభించక ముందే యంత్రాలు మాయం
ఇలా ఉత్పత్తి ప్రారంభించకుండానే మూతపడ్డ రూ. 6 వేల కోట్ల ప్రాజెక్టు ధయనీయ పరిస్థితికి చేరువైంది. మరోవైపు NBPPL నిర్మాణానికి అప్పట్లో 750 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా 100 ఎకరాల్లో సంస్థకు సంబంధించిన నిర్మాణాలు జరిగాయి. మిగిలిన 650 ఎకరాలు 16 ఏళ్లుగా నిరుపయోగంగా ఉండిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
