AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. దరఖాస్తు చేస్కోండిలా..

ఏపీ ప్రభుత్వం పేదలకు ఏడాదికి నాలుగు సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. రేషన్ కార్డు మీరు కలిగి ఉంటే ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు. గ్రామ, వార్డు సచివాలయలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Gas Cylinder: ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. దరఖాస్తు చేస్కోండిలా..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Aug 25, 2026 | 9:19 PM

Share

ఏపీలోని ప్రజలకు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీపం 2 పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పధకం ద్వారా పేదలకు ఉచిత గ్యా్స్ సిలిండర్లను అందిస్తోంది. రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపచేస్తోంది. ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పొందవచ్చు. ముందుగా వినియోగదారుడు గ్యాస్ బుక్ చేసుకుని పేమెంట్ చేయాలి. సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లో సిలిండర్ ఎంత ధర అయితే ఉందో.. అంత మొత్తం లబ్దిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోవడంతో పేదలకు భారంగా మారాయి. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. అసలు ఈ పథకానికి ఎవరెవరు అర్హలు..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అర్హతలు ఏంటి..?

ఏపీ నివాసి అయి ఉండాలి. రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. వయస్సు 18 సంత్సరాలు నిండి ఉండాలి.

ఏయే పత్రాలు అవసరం

తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్ కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు. రేషన్, ఆధార్, గ్యాస్ కనెక్షన్ ఒకే వ్యక్తి పేరుపై కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయితే డబ్బులు అకౌంట్లో పడతాయి.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే మండల పరిషత్ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక నిర్ధీత తేదీల్లో ప్రకటన విడుదల చేస్తారు. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సచివాలయ అధికారులను సంప్రదించి దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి. వ్యక్తిగత, కుటుంబసభ్యులు, ఆధార్ నెంబర్ వంటివి అందించాలి. అవసరమైన పత్రాలు సమర్పించి గ్రామ సచివాలయంలో అందించాలి. అనంతరం అధికారులు పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉంటే లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. 2024 నవంబర్‌లో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. అప్పటినుంచి కొనసాగుతోంది.

నగదు జామ కాకపోతే ఏం చేయాలి..?

ఒకవేళ సబ్సిడీ సొమ్ము మీ అకౌంట్లో జమ కాకపోతే తొలుత గ్యా్స్ ఏజెన్సీని సంప్రదించాలి. అనంతరం ఈకేవైసీ పెండింగ్‌లో ఉంటే ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్‌తో ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి. ఈ ప్రక్రియలు అన్నీ పూర్తి చేస్తే మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. అప్పటికీ జమ కాకపోతే 1967 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించండి.

Follow Us