AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే థియేటర్​ అనుభూతి కావాలా? హువావే మేట్​ టీవీ 2 ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతిని అందించే స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి Huawei Mate TV 2 సిరీస్ ఆకట్టుకునేలా ఉంది. Enjoy, Standard, Pro, Max పేర్లతో నాలుగు వేరియంట్లను తీసుకొచ్చింది. 110 అంగుళాల భారీ స్క్రీన్, 6,000 నిట్స్ బ్రైట్‌నెస్, శక్తివంతమైన సౌండ్‌తో ఈ సిరీస్ ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఇంట్లోనే థియేటర్​ అనుభూతి కావాలా?  హువావే మేట్​ టీవీ 2 ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్
Huawei Mate Tv 2
Nikhil
|

Updated on: Oct 04, 2026 | 8:35 PM

Share

పెద్ద స్క్రీన్‌తో సినిమా చూస్తే థియేటర్ అనుభూతి మరింత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న Huawei.. Mate TV 2 సిరీస్‌లో డిస్‌ప్లేకు భారీ ప్రాధాన్యత ఇచ్చింది. Super Mini LED ప్యానెల్స్, Kirin T92 చిప్‌సెట్, HarmonyOS 7తో వచ్చిన ఈ టీవీల ధరలు కూడా ప్రీమియం స్థాయిలోనే ఉన్నాయి.

6,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో భారీ స్క్రీన్

Huawei Mate TV 2 సిరీస్‌లో డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సిరీస్‌లో Mate TV 2 Enjoy, Mate TV 2, Mate TV 2 Pro, Mate TV 2 Max అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అన్ని మోడళ్లలోనూ Super Mini LED ప్యానెల్స్‌ను ఉపయోగించారు. సాధారణ Mate TV 2 మోడల్ 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇక టాప్-ఎండ్ Mate TV 2 Maxలో ఏకంగా 6,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 110 అంగుళాల భారీ డిస్‌ప్లేను అందించారు. పెద్ద స్క్రీన్‌తో పాటు అధిక బ్రైట్‌నెస్ ఉండటంతో సినిమాలు, క్రీడలు, గేమింగ్ వంటి కంటెంట్‌ను మరింత ఆకర్షణీయంగా ఆస్వాదించవచ్చు.

ఈ సిరీస్‌లో మరో ఆసక్తికరమైన ఫీచర్ 2D కంటెంట్‌ను రియల్ టైమ్‌లో 3D అనుభూతికి మార్చే సాంకేతికత. సాధారణ వీడియో కంటెంట్‌ను మరింత ప్రత్యేకంగా చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది. పనితీరు కోసం Huawei సొంత Kirin T92 చిప్‌సెట్‌ను ఉపయోగించింది. ఈ టీవీలు HarmonyOS 7 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తాయి. Enjoy, Standard మోడళ్లలో 8GB RAM, 128GB స్టోరేజ్ లభిస్తుండగా, Pro, Max వేరియంట్లలో 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి. Huawei స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లను ఈ టీవీలకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. గేమింగ్, విద్యకు సంబంధించిన యాప్స్‌ను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్

డిస్‌ప్లేతో పాటు సౌండ్ విషయంలోనూ Huawei ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. Mate TV 2 Enjoyలో 130W సౌండ్ అవుట్‌పుట్ ఉండగా, Standard మోడల్‌లో 180W, Pro మోడల్‌లో ఏకంగా 240W సౌండ్ అవుట్‌పుట్ అందించారు. దీంతో పెద్ద గదుల్లోనూ శక్తివంతమైన ఆడియో అనుభూతి లభించే అవకాశం ఉంది. 4K స్క్రీన్ కాస్టింగ్, Smart Home Control వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. దీంతో టీవీని కేవలం సినిమాలు చూసే పరికరంగా కాకుండా ఇంట్లోని ఇతర స్మార్ట్ పరికరాలను నియంత్రించేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు.

ధర విషయానికి వస్తే చైనాలో Mate TV 2 Enjoy 65 అంగుళాల మోడల్ ధర సుమారు రూ.98,000 నుంచి ప్రారంభమవుతుంది. 85 అంగుళాల మోడల్ ధర సుమారు రూ.1,72,000 వరకు ఉంటుంది. Mate TV 2 Standard ధర రూ.1,23,000 నుంచి రూ.3,32,000 వరకు ఉంది. Pro మోడళ్ల ధరలు రూ.2,09,000 నుంచి రూ.4,30,000 వరకు ఉన్నాయి.

Follow Us