AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికిత్సకు వాడాల్సిన మందులు మత్తు కోసం.. మెడికల్ షాపుల్లో సరికొత్త దందా!

తెలంగాణలో హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయాలపై టీజీ సేఫ్ డ్రగ్స్ విభాగం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు, రికార్డుల నిర్వహణలో లోపాలు సహా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి 125 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయా షాపులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

చికిత్సకు వాడాల్సిన మందులు మత్తు కోసం.. మెడికల్ షాపుల్లో సరికొత్త దందా!
Medical Shops Inspections
Shaik Madar Saheb
|

Updated on: Oct 25, 2026 | 8:24 AM

Share

మందు ప్రాణం పోయాలి.. కానీ అదే మందు మత్తుకు బానిసను చేస్తే..? చికిత్స కోసం వాడాల్సిన ఔషధాలే వ్యసనానికి దారితీస్తే..? ఇప్పుడు తెలంగాణలో ఇదే వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. మెడికల్‌ షాపుల్లో అమ్మేది మందులే అయినా.. అవి ఎవరికి చేరుతున్నాయి..? ఎందుకోసం వాడుతున్నారు..? వాటి అమ్మకాలపై అసలు కంట్రోల్‌ ఉందా..? అన్నదానిపై అధికారులు ఫోకస్‌ పెట్టారు. యువతను మత్తుకు బానిసలుగా మార్చే హాబిట్‌ ఫార్మింగ్‌ డ్రగ్స్‌ అక్రమ దందాపై అధికారులు ఫోకస్‌ పెట్టారు. మెడికల్‌ షాపుల ముసుగులో మత్తు మందుల వ్యాపారం సాగుతోందా..? డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో ఇవ్వాల్సిన మందులు అడ్డదారిలో అమ్ముతున్నారా..? అన్న కోణంలో టీజీ సేఫ్‌ డ్రగ్స్‌ వింగ్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. హైదరాబాద్‌ CURE పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, కాప్రా, హబ్సిగూడ, ఉప్పల్‌, జీడిమెట్ల, బాలానగర్‌, మేడిపల్లి, షామీర్‌పేట ప్రాంతాల్లో మెడికల్‌ షాపులను జల్లెడ పట్టింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది.

కొనుగోళ్లు, అమ్మకాలకు పక్కా రికార్డులు ఉన్నాయా?

ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో ప్రధానంగా హాబిట్‌ ఫార్మింగ్‌ డ్రగ్స్‌ అమ్మకాలపై అధికారులు నిఘా పెట్టారు. ట్రామడాల్‌, ఆల్ప్రాజోలం, నైట్రాజెపామ్‌, టాపెంటడాల్‌, ప్రెగాబాలిన్‌, జోల్పిడెమ్‌తో పాటు కోడిన్‌ కలిగిన దగ్గు సిరప్‌ల విక్రయాలను పరిశీలించారు. డాక్టర్‌ చీటీ లేకుండా ఈ మందులను విక్రయిస్తున్నారా..? కొనుగోళ్లు, అమ్మకాలకు పక్కా రికార్డులు ఉన్నాయా..? చికిత్స కోసం ఉపయోగించాల్సిన మందులను మత్తు కోసం దారి మళ్లిస్తున్నారా..? అన్న కోణంలో ఆరా తీశారు.

ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందులు విక్రయిస్తున్నట్టు గుర్తింపు

అధికారుల తనిఖీల్లో మెడికల్‌ షాపుల నిబంధనల ఉల్లంఘనలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందులు విక్రయించడం.. రిజిస్టర్డ్‌ ఫార్మసిస్ట్‌ లేకుండా మెడిసిన్స్‌ ఇవ్వడం.. బిల్లులు జారీ చేయకపోవడం వంటి అక్రమాలను గుర్తించారు. షెడ్యూల్‌ హెచ్‌1 డ్రగ్స్‌ రిజిస్టర్లు నిర్వహించకపోవడంతో పాటు కొనుగోళ్లు, అమ్మకాల లెక్కల్లోనూ తేడాలు బయటపడ్డాయి. దీంతో రూల్స్‌ బ్రేక్‌ చేసిన 125 మెడికల్‌ షాపులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వివరణ ఆధారంగా డ్రగ్‌ లైసెన్సుల సస్పెన్షన్‌, రద్దుతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మొత్తంగా హాబిట్‌ ఫార్మింగ్‌ డ్రగ్స్‌ అక్రమ విక్రయాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చికిత్స కోసం ఇవ్వాల్సిన మందులను మత్తు కోసం మళ్లిస్తే క్రిమినల్‌ కేసులు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పటికే 125 మెడికల్‌ షాపులకు నోటీసులు జారీ కావడంతో.. నెక్స్ట్‌ యాక్షన్‌ ఏంటి..? ఎన్ని షాపుల లైసెన్సులపై వేటు పడబోతోంది..? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Follow Us
మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘన.. లైసెన్సులపై వేటు పడనుందా?
మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘన.. లైసెన్సులపై వేటు పడనుందా?
ఫతేపూర్ సిక్రీ కొండల్లో 7,000 ఏళ్ల నాటి ప్రాచీన సంపద..కాపాడేందుకు
ఫతేపూర్ సిక్రీ కొండల్లో 7,000 ఏళ్ల నాటి ప్రాచీన సంపద..కాపాడేందుకు
ఐదుగురి ప్రాణాలు తీసిన పులి చిక్కింది.. నెల రోజుల ఉత్కంఠకు తెర!
ఐదుగురి ప్రాణాలు తీసిన పులి చిక్కింది.. నెల రోజుల ఉత్కంఠకు తెర!
వన్డేలో 10 ఓవర్లకు బదులు 11 ఓవర్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్‌పై ఫిర్యాదు
వన్డేలో 10 ఓవర్లకు బదులు 11 ఓవర్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్‌పై ఫిర్యాదు
కోజాగిరి పౌర్ణమి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే శుభమా? లక్ష్మీదేవి..
కోజాగిరి పౌర్ణమి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే శుభమా? లక్ష్మీదేవి..
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్
కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్
కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్
నమన్ ధీర్ దెబ్బకు టీమిండియాలో ముగ్గురికి టెన్షన్
నమన్ ధీర్ దెబ్బకు టీమిండియాలో ముగ్గురికి టెన్షన్
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. నవంబర్ 17 వరకు సెలవులు
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. నవంబర్ 17 వరకు సెలవులు
కేవలం 7 రూపాయల టికెట్.. కూలీ భార్యను కోటీశ్వరాలిని చేసిన అదృష్టం!
కేవలం 7 రూపాయల టికెట్.. కూలీ భార్యను కోటీశ్వరాలిని చేసిన అదృష్టం!