AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఖాతాదారులకు ఎస్బీఐ బిగ్ అలర్ట్.. నెల రోజుల్లో ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్..

ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఇనాపరేటివ్ అకౌంట్ కలిగినవారు వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని హెచ్చరించింది. బ్యాంక్ బ్రాంచులను సంప్రదించడం లేదా ఆన్ లైన్ విధానంలో ప్రాసెస్ కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది.

SBI: ఖాతాదారులకు ఎస్బీఐ బిగ్ అలర్ట్.. నెల రోజుల్లో ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్..
Sbi Account
Venkatrao Lella
|

Updated on: Oct 25, 2026 | 7:45 AM

Share

తమ సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇనాక్టివ్ అయిన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన జారీ చేసింది. రెండేళ్లకుపైబడి బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయకపోతే ఖాతా ఆటోమేటిక్‌గా ఇనాపరేటివ్‌గా మారుతూ ఉంటుంది. యూపీఐ, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ బ్రాంచ్ ద్వారా ఏదొక ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే అకౌంట్  ఇనాక్టివ్ అవుతుంది. ఇలాంటి ఖాతాదారులు వెంటనే కేవైసీ అప్టేట్ చేయించుకోవాలని ఎస్బీఐ సూచించింది.

ఎస్బీకి సంబంధించిన ఏదైనా బ్రాంచ్‌ను సంప్రదించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ తీసుకెళితే సరిపోతుంది. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం, వాట్సప్ బ్యాంకింగ్ ప్రక్రియ ద్వారా ఇంటి వద్దను ఖాతాదారులు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చని ఎస్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ ఛానెళ్ల ద్వారా చేసుకోవాలని సూచించింది. అలాగే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు బ్యాలెన్స్ లేనటువంటి ఇనాపరేటివ్ ఖాతాదారులు కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది. ఒక నెల రోజుల్లో కేవైసీ పూర్తి చేయాలని తెలిపింది. అప్డేట్ చేయకపోతే నెల తర్వాత అకౌంట్ క్లోజ్ అవుతుందని హెచ్చరించింది. కేవైసీ అప్డేట్ చేయకపోతే సమాచారం లేకుండా బ్యాంక్ అకౌంట్‌ను మూసివేసే అవకాశముంటుంది.

దీంతో ఖాతాదారులు దీనిని గమనించి వెంటే తమ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. లేకపోతే రెగ్యూలర్ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం మీరు రెండేళ్ల పాటు ఏదైనా అకౌంట్ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయకపోతే ఇనాపరేటివ్‌గా పరిగణిస్తారు. ఆ అకౌంట్ నుంచి మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు. డెబిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు బ్లాక్ అవుతాయి. ఆర్బీఐ నిబంధనల ఏడాదికి ఒకసారి బ్యాంక్ ఖాతాదారులు తమ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా సులువుగా నిమిషాల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా అప్డేట్ చేసుకోవడం వల్ల మీ అకౌంట్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. మీరు అకౌంట్ వాడకపోయినా క్లోజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Follow Us
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్
SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే అకౌంట్ క్లోజ్
కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్
కెప్టెన్ కాకపోయినా నరేష్‌కు కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్
నమన్ ధీర్ దెబ్బకు టీమిండియాలో ముగ్గురికి టెన్షన్
నమన్ ధీర్ దెబ్బకు టీమిండియాలో ముగ్గురికి టెన్షన్
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. నవంబర్ 17 వరకు సెలవులు
బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. నవంబర్ 17 వరకు సెలవులు
కేవలం 7 రూపాయల టికెట్.. కూలీ భార్యను కోటీశ్వరాలిని చేసిన అదృష్టం!
కేవలం 7 రూపాయల టికెట్.. కూలీ భార్యను కోటీశ్వరాలిని చేసిన అదృష్టం!
కోజాగిరి పౌర్ణమి.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ఇలా పూజించండి
కోజాగిరి పౌర్ణమి.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ఇలా పూజించండి
పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. విచిత్ర వీడియో వైరల్‌
పుట్టగానే మీసాలతో రచ్చ చేస్తున్న బుడ్డొడు.. విచిత్ర వీడియో వైరల్‌
ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే?
ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు తులం ఎంతంటే?
ఏపీలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. ఇక భారీ వర్షాలే..
ఏపీలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్.. ఇక భారీ వర్షాలే..
రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా ఊరట.. మీ రాశికి ఎలా ఉందంటే..?
రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా ఊరట.. మీ రాశికి ఎలా ఉందంటే..?