దేశంలోనే అతిపెద్ద బస్ స్టేషన్ ఇదే.. ఏ రాష్ట్రంలో ఉందంటే..?
Venkatrao Lella
Images: Pinterest
24 OCT 2026
దేశంలోనే అతిపెద్ద బస్ స్టేషన్‌గా చెన్నైలోని మోఫుసిల్ బస్ టెర్మినల్(CMBT) పేరు పొందింది. ఇది దాదాపు 36.57 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని నిర్మాణానికి రూ.103 కోట్లు ఖర్చు చేశారు.
అక్టోబర్ 2018లో మాజీ సీఎం ఎం.జి. రామచంద్రన్ గౌరవార్థం.. దీనికి పురచ్చి తలైవర్ డా. ఎం.జి.ఆర్ బస్ టెర్మినల్‌గా పేరు మార్చారు.
ప్రతీరోజు ఈ బస్ స్టేషన్ నుంచి 2 వేలకుపైగా బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. 2002లో ఇది ప్రారంభమైంది.
ఆసియాలోనే అతిపెద్ద బస్ టెర్మినల్‌గా ఇది ప్రసిద్ధి గాంచింది. నవంబర్ 18,2002న దీనిని ప్రారంభించగా.. అక్టోబర్ 24 నాటికి దాదాపు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
1991 నుంచి 1996 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఈ బస్ స్టేషన్‌కు ప్రణాళికలు సిద్దం చేశారు. ఆ తర్వాత 1999 జూన్ 6న అప్పుడు సీఎంగా ఉన్న కరుణానిధి శంకుస్థాపన చేశారు. మూడేళ్లపాటు నిర్మాణం చేపట్టారు.
చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ బస్ టెర్మినల్ నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. అప్పట్లో దీని నిర్మాణానికి రూ.103 కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు. నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేసింది.
చెన్నైలోని కోయంబేడు ఏరియాలో జవహర్లాల్ నెహ్రూ సాలై లేదా ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ బస్ స్టేషన్ ఉంది. అత్యాధునిక సౌకర్యాలతో దీనిని అభివృద్ది చేశారు. ప్రయాణికులకు అనేక సదుపాయాలు ఉన్నాయి.
ఈ బస్ స్టేషన్లో 3 బస్ టెర్మినల్స్, ఆరు ఫ్లాట్ ఫామ్స్, 180 బస్ బేలు ఉన్నాయి. 60 బస్సుల కోసం ప్రత్యేకమైన పార్కింగ్ ఏరియా అందుబాటులో ఉంది. అలాగే సుమారు 270 బస్సులు ఉంచేలా ఏర్పాట్లు చేశారు.
బస్ స్టేషన్లోనే రెస్టారెంట్లు, కేఫ్టీరియాలు, చిన్న దుకాణాలు ఉన్నాయి. దీని వల్ల ప్రయాణికులు ఫుడ్ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే ఆహారం అందుబాటులో ఉంటుంది.
ఇక టాక్సీలు, ప్రైవేట్ వెహికల్స్, ఆటోలు, బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశం ఉంది. ఇక వెయిటింగ్ రూమ్స్, విచారణ కౌంటర్లు, లాకర్ రూమ్స్, వాష్ రూమ్స్, మంచినీటి సౌకర్యాలు ఉన్నాయి.