AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ఏకంగా రూ.5 వేలు డౌన్.. వెండి కూడా ఢమాల్.. కొనేవారికి ఇదే మంచి ఛాన్స్..

బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ వారంలో ఒక్కసారిగా పతనమయ్యాయి. సోమవారం నుంచి ధరలు డౌన్ అవుతూనే ఉన్నాయి. బంగారంతో పాటు వెండి కూడా దిగొస్తుంది. వెండి రూ.2 లక్షల వద్దకు చేరుకుంది. ఈ వారం మొత్తం మీద ధరలు ఎంత తగ్గాయంటే.

Gold Prices: బంగారం ఏకంగా రూ.5 వేలు డౌన్.. వెండి కూడా ఢమాల్.. కొనేవారికి ఇదే మంచి ఛాన్స్..
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Oct 24, 2026 | 11:10 PM

Share

ఈ వారంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పండుగల సీజన్ క్రమంలో ఈ పరిణామం కొనుగోలుదారులకు ఊరట కల్గిస్తోంది. త్వరలో దీపావళి పండుగ వస్తుండటం, పెళ్లిళ్ల సీజన్ వేళ ధరలు డౌన్ కావడం శుభపరిణామంగా కొనుగోలుచేసేవారు భావిస్తున్నారు. బంగారం ధరలు పడిపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతుండటంతో పాటు అమెరికా డాలర్ బలపడుతోంది. అలాగే అమెరికన్ ట్రెజరీ ఈల్డ్స్ కారణంగా ఈ వారం బంగారం ధరలు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ధరల పతనానికి ఇది కారణంగా చెబుతున్నారు. అలాగే ద్రవ్యోల్బణంపై కొత్తగా తలెత్తిన ఆందోళనలు, కఠినమైన అమెరికన్ ద్రవ్య విధానంపై అంచనాలు పసిడిపై ఒత్తిడిని పెంచాయి. దీని ఫలితంగా వీటి ధరలు కుప్పకూలుతున్నాయి.

వారంలో రోజుల్లో ఎంత తగ్గాయంటే..?

-అక్టోబర్ 19న సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,650 వద్ద ఉండగా.. అక్టోబర్ 24 నాటికి రూ.1,42,580కి చేరుకున్నాయి. అంటే వారం రోజుల్లో ఏకంగా రూ.5070 తగ్గాయి. ఇక 22 క్యారెట్ల ధర అక్టోబర్ 19న రూ.1,35,340 వద్ద ట్రేడవ్వగా… 24వ తేదీ నాటికి రూ.1,30,700కి చేరుకుంది. అంటే రూ.4640 పడిపోయింది. విజయవాడ,విశాఖపట్నంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.

-ఇక దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 19న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,800 వద్ద ప్రారంభమవ్వగా.. శనివారం నాటికి రూ.1,42,730కి చేరుకున్నాయి. ఇక 22 క్యారెట్ల ధర ఈ వారంలో రూ.1,35,490 నుంచి రూ.1,30,50కి చేరుకుంది.

వెండి ధరలు ఇలా..

-ఇక వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. అక్టోబర్ 19వ తేదీన రూ.2,29,000 వద్ద మొదలయ్యాయి. అక్టోబర్ 24న దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.2.20 లక్షల వద్ద కొనసాగుతోంది.

-శుక్రవారం మూడు నెలల కనిష్ట స్థాయికి బంగారం పడిపోయింది. నాలుగు నెలల కాలంలో ఎక్కువగా ధరలు పడిపోయిన వారంగా నిలిచింది. అక్టోబర్ 27,28వ తేదీల్లో యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం జరగనుంది. వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశముందనే ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే గోల్డ్ రేట్లు మరింత పడిపోవచ్చు. ఈ వారం సుమారు 4 శాతం మేర బంగారం ధర క్షీణించింది.

Follow Us