రూ.250 కోట్ల లాటరీ గెలిచిన తెలంగాణా యువకుడు.. ఆ డబ్బుతో ఏం చేశాడంటే?
తెలంగాణాకు చెందిన ఓ యువకుడికి అదృష్టం తలుపు తట్టింది. యూఏఈ లాటరీలో ఏకంగా రూ.250 కోట్లకు పైగా జాక్‌పాట్ గెలుచుకున్నాడు. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే, ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడమే కాకుండా.. కుటుంబానికి భద్రత కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు.

తెలంగాణాకు చెందిన ఓ యువకుడికి అదృష్టం తలుపు తట్టింది. యూఏఈ లాటరీలో ఏకంగా రూ.250 కోట్లకు పైగా జాక్‌పాట్ గెలుచుకున్నాడు. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే, ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడమే కాకుండా.. కుటుంబానికి భద్రత కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. తన తండ్రి కోసం వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. తల్లిదండ్రులు ప్రశాంతంగా జీవించేలా ఏర్పాట్లు చేశాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? లాటరీలో వచ్చిన డబ్బుతో ఇంకేం కొన్నాడు? భవిష్యత్తు కోసం ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నాడు?
రూ.250 కోట్లకు పైగా జాక్‌పాట్
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ బొల్లా (29) యూఏఈలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతేడాది అక్టోబర్ 18న యూఏఈ లాటరీ నిర్వహించిన ‘లక్కీ డే’ డ్రాలో అతడు ఏకంగా 100 మిలియన్ దర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.250 కోట్లకు పైమాటే. ఈ లాటరీలో భారీ జాక్‌పాట్ గెలుచుకున్న తొలి వ్యక్తిగా అనిల్‌కుమార్ చరిత్ర సృష్టించాడు.
లాటరీ గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి వీడియోలో తన అనుభవాలను పంచుకున్నాడు. ఆస్తుల కొనుగోలు నుంచి కుటుంబానికి సహాయం చేయడం వరకు, ఈ ఏడాది తన నిర్ణయాల గురించి వివరించాడు.
అబుదాబి, దుబాయ్‌లో ఆస్తులు
లాటరీలో వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని అనిల్‌కుమార్ ఆస్తుల కొనుగోలుకు వెచ్చించాడు. యూఏఈలోని అబుదాబి, దుబాయ్ నగరాల్లో రెండు ప్రాపర్టీలు కొనుగోలు చేసాడు. అబుదాబి విమానాశ్రయానికి సమీపంలో ఒక ఆస్తిని, దుబాయ్ మెరీనా ప్రాంతానికి దగ్గరగా మరో ఆస్తిని కొన్నాడు. వీటితో పాటు తన కోసం ఐఫోన్ 17 ఎయిర్ ఫోన్‌ను కొనుక్కున్నాడు. నాలుగైదు ఖరీదైన చేతి గడియారాలను కూడా సేకరించాడు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఖర్చు చేయాలనే నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని అనిల్‌కుమార్ తెలిపాడు. ముఖ్యంగా తన చుట్టూ ఉన్నవారి అంచనాలను సమతుల్యం చేసుకుంటూ, బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోవడం పెద్ద సవాలుగా మారిందని చెప్పాడు.
తండ్రి కోసం వ్యవసాయ భూమి కొనుగోలు
అనిల్‌కుమార్ తండ్రి కోసం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి ఆర్గానిక్ ఫార్మింగ్ పై ఆసక్తి చూపిస్తారని, అందుకే వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పాడు. లాటరీ డబ్బుతో తన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందనీ అన్నాడు. తన తల్లిదండ్రులు ఇకపై ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలనేది తన ఉద్దేశమని అనిల్‌కుమార్ మాటలను బట్టి అర్థమవుతోంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, తమకు నచ్చిన విధంగా ప్రశాంతంగా జీవించే అవకాశాన్ని వారికి కల్పించగలిగానని అతడు సంతోషం వ్యక్తం చేశాడు. తన తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని తనను హత్తుకుంటుందని తెలిపాడు.
బాలీ, థాయ్‌లాండ్, ఆమ్‌స్టర్‌డామ్ పర్యటనలు
లాటరీ గెలిచిన తర్వాత అనిల్‌కుమార్ బాలీ, థాయ్‌లాండ్, ఆమ్‌స్టర్‌డామ్ సందర్శించాడు. భారత్‌కు కూడా పలుమార్లు వచ్చి వెళ్లాడు. ఇంతకుముందు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలోచించాల్సి వచ్చిన కొన్ని విషయాల్లో ఇప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభించిందని తెలిపాడు. అయితే, డబ్బు వచ్చినంత మాత్రాన జీవితంలోని అన్ని సమస్యలు పరిష్కారమైపోవని, దాన్ని జాగ్రత్తగా నిర్వహించడం కూడా ముఖ్యమని చెప్పాడు.
What has the past year been like for our AED 100,000,000 winner? 🤔
From traveling the world to making meaningful memories with his family, Anilkumar Bolla shares how the past year has unfolded, the lessons he’s learned, and what comes next. ❤️
Watch the full video to hear his story! 🎬
#TheUAELottery #WinnerSpotlight #DareToImagine
— The UAE Lottery (@theuaelottery) October 22, 2026
వచ్చే ఐదేళ్లలో పెళ్లి, కుటుంబం.. ఆరోగ్యంపై దృష్టి
భవిష్యత్తు గురించి అనిల్‌కుమార్ కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాడు. వచ్చే ఐదేళ్లలో తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, పెళ్లి చేసుకోవడం, కనీసం ఒక బిడ్డకు తండ్రి కావడం వంటివి తన లక్ష్యాలని తెలిపాడు. వందల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత కూడా అతడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సాధారణ లక్ష్యాలపైనే దృష్టి పెట్టాడు. ఆర్థికంగా స్థిరపడటంతో పాటు ఆరోగ్యం, కుటుంబం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాడు.
ఇంకా లాటరీ టికెట్లు కొంటా
రూ.250 కోట్లకు పైగా జాక్‌పాట్ గెలుచుకున్నప్పటికీ, యూఏఈ లాటరీలో పాల్గొనడం కొనసాగిస్తానని, ఆ లాటరీ వేదికపై తనకు నమ్మకం ఉందని తెలిపాడు. రెండవ సారి కొందరు రూ.30 మిలియన్లు, రూ.5 మిలియన్లు భారీ బహుమతులు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించాడు. 2025 అక్టోబర్ 18న జరిగిన ‘లక్కీ డే’ డ్రాలో విజేతగా నిలిచాడు. ఆ సమయంలో జాక్‌పాట్ గెలిచే అవకాశాలు 88 లక్షల్లో ఒకరికే ఉందని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
‘వినయంగా ఉండండి.. ఆచితూచి ఖర్చు చేయండి’
లాటరీ ద్వారా ఒక్కసారిగా భారీ సంపద వచ్చినా.. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్నదే ముఖ్యమని అనిల్‌కుమార్ చెప్పాడు. ఆస్తులు కొనుగోలు చేయడం, కుటుంబానికి భద్రత కల్పించడం, వ్యక్తిగత లక్ష్యాలను నిర్దేశించుకున్న అతడు చివరగా అందరికీ ఓ ముఖ్యమైన సందేశం ఇచ్చాడు. ఒక్కసారిగా అదృష్టం కలిసొచ్చినా, ఆర్థిక క్రమశిక్షణను పాటించడం ఎంతో ముఖ్యమనీ చెబుతూనే, ‘వినయంగా ఉండండి.. డబ్బును ఆచితూచి ఖర్చు చేయండి’ అని సూచించాడు.