AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఓర్నీ సర్పంచ్‌ను ఇలా కూడా ఎన్నుకుంటారా..? తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే.. ?

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నక్కలపల్లిలో సర్పంచ్ పదవికి టెండర్ తరహా విధానం అనుసరించడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాభివృద్ధికి ఎంత మొత్తం ఇస్తారో చీటీల్లో రాసి డబ్బాలో వేయగా.. సుదర్శన్ రెడ్డి తన భార్య అఖిల పేరుతో అత్యధికంగా రూ.25.60 లక్షలు కోట్ చేశారు. దీంతో గ్రామస్తులు ఆమెను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సమాచారం.

Andhra: ఓర్నీ సర్పంచ్‌ను ఇలా కూడా ఎన్నుకుంటారా..? తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే.. ?
Sarpanch Post Auction
Nalluri Naresh
| Edited By: |

Updated on: Nov 17, 2026 | 6:34 PM

Share

సాధారణంగా మద్యం దుకాణాల లైసెన్సులు, కాంట్రాక్ట్ పనుల కోసం టెండర్లు నిర్వహిస్తుంటారు. ఎవరు ఎంత మొత్తానికి కోట్ చేస్తారో రహస్యంగా చీటీల్లో రాసి డబ్బాలో వేస్తారు. ఆ తర్వాత వాటిని తెరిచి అత్యధిక మొత్తం కోట్ చేసినవారికి టెండర్ కేటాయిస్తారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్రామంలో సర్పంచ్ పదవికి కూడా ఇదే తరహా టెండర్ విధానం అనుసరించడం చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని నక్కలపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. గ్రామంలో సర్పంచ్ పదవిని దక్కించుకోవాలంటే ప్రజల ఓట్లు అవసరం లేదు.. గ్రామాభివృద్ధికి ఎంత మొత్తం ఖర్చు చేస్తారన్నదే కొలమానంగా మారింది. ఎవరు ఎక్కువ మొత్తం ఇస్తామని ముందుకొస్తే వారికే సర్పంచ్ పదవి దక్కేలా గ్రామస్తులు ఓ పద్ధతిని అనుసరించారు.

గత ఎన్నికల్లోనూ ఇదే తరహాలో సర్పంచ్‌ను ఎంపిక చేసిన గ్రామస్తులు.. ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించారు. నక్కలపల్లి సర్పంచ్ స్థానం జనరల్ మహిళలకు రిజర్వు కావడంతో.. సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులను గ్రామస్తులు ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించారు. గ్రామాభివృద్ధికి తాము ఎంత మొత్తం ఇస్తామో చీటీలపై రాసి ఓ డబ్బాలో వేయాలని సూచించారు.

ఈ విధానంలో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు పాల్గొన్నారు. అందరూ తమకు తోచిన మొత్తాన్ని చీటీలపై రాసి డబ్బాలో వేశారు. అనంతరం గ్రామస్తులు ఆ చీటీలను తెరిచి చూడగా.. సుదర్శన్ రెడ్డి తన భార్య అఖిల పేరుతో అత్యధికంగా రూ.25.60 లక్షలు ఇస్తానని పేర్కొన్నారు. దీంతో గ్రామస్తులు ఆయన ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ విధంగా సుదర్శన్ రెడ్డి తన భార్య అఖిలను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఇదే గ్రామంలో రామిరెడ్డి రూ.21 లక్షలు ఇస్తానని ముందుకొచ్చి సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు స్థానికంగా చెబుతున్నారు. ఈసారి రూ.25.60 లక్షలతో ఆ మొత్తాన్ని అధిగమించారు. ఇటీవల గార్లదిన్నె మండలం కొప్పలకొండలోనూ సర్పంచ్ పదవికి వేలం నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు నక్కలపల్లిలో చీటీల ద్వారా సర్పంచ్‌ను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది.

గమనిక: ఇది గ్రామస్తులు అనుసరించినట్లు చెబుతున్న అనధికారిక ఎంపిక విధానం మాత్రమే. చీటీలో అత్యధిక మొత్తం రాసినంత మాత్రాన చట్టబద్ధంగా సర్పంచ్ పదవి దక్కినట్లు కాదు. ఎన్నికల ప్రక్రియ, అధికారిక నామినేషన్లు, ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించి అధికారులు పూర్తి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

Follow Us
ఎవరు ఎక్కువ డబ్బులు చీటీలో రాసి డబ్బాలో వేస్తే వారే సర్పంచ్..
ఎవరు ఎక్కువ డబ్బులు చీటీలో రాసి డబ్బాలో వేస్తే వారే సర్పంచ్..
63 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ లుక్స్.. 30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ..
63 ఏళ్ల వయసులోనూ స్టన్నింగ్ లుక్స్.. 30 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ..
మన టైమ్ వచ్చేసింది భయ్యా! కార్తీక పౌర్ణమి నుంచి వీరికి మహర్దశ..
మన టైమ్ వచ్చేసింది భయ్యా! కార్తీక పౌర్ణమి నుంచి వీరికి మహర్దశ..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్..
ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ గుండా వెళ్తున్నారా..? అలర్ట్
ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ గుండా వెళ్తున్నారా..? అలర్ట్
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’..
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’..
ఒక చేతిలో 3 యాపిల్స్, 4 ఆరెంజ్‌లు.. మరో చేతిలో 4 యాపిల్స్, 3 ఆరెం
ఒక చేతిలో 3 యాపిల్స్, 4 ఆరెంజ్‌లు.. మరో చేతిలో 4 యాపిల్స్, 3 ఆరెం
కేవలం ₹3 ఖర్చుతో.. మొక్కలకు వచ్చే బూజు తెగులు, పురుగులు మాయం!
కేవలం ₹3 ఖర్చుతో.. మొక్కలకు వచ్చే బూజు తెగులు, పురుగులు మాయం!
మీ పెన్ గ్రిప్ చెప్పే మీ సీక్రెట్ పర్సనాలిటీ ఇదే..!
మీ పెన్ గ్రిప్ చెప్పే మీ సీక్రెట్ పర్సనాలిటీ ఇదే..!
దోస పిండి లో ఇది ఒక్కటి కలపండి.. కర కరలాడటం పక్కా
దోస పిండి లో ఇది ఒక్కటి కలపండి.. కర కరలాడటం పక్కా