ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్, టెలిగ్రాం బంద్.. వాడాలంటే ఇది తప్పనిసరి
Venkatrao Lella
Images: Pinterest
23 OCT 2026
వాట్సప్, టెలిగ్రాం, షేర్ చాట్ లాంటి సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి సిమ్ బైండింగ్ నిబంధన తప్పనిసరి చేసింది. 2027,జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది.
ఇక నుంచి వాట్సప్, టెలిగ్రాం లాంటి యాప్స్ వాడాలంటే తప్పనిసరిగా మీ ఫోన్‌లో యాక్టివ్ సిమ్ ఉండాలి. సిమ్ లేకపోతే మీరు వాటిని వినియోగంచలేరు. సిమ్ తీసివేస్తే సేవలు నిలిచిపోతాయి.
సైబర్ నేరాలు, ఆర్ధిక నేరాలు, డీజిటల్ అరెస్ట్ లాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ రూల్ కొత్తగా తీసుకొచ్చింది. కంపెనీలకు డిసెంబర్ 31 వరకు కంపెనీలకు గడువు కల్పించింది.
ఏ నెంబర్‌తో మెస్సేజింగ్ యాప్‌లో లాగిన్ అవుతారో.. ఆ సిమ్ ఖచ్చితంగా అదే స్మార్ట్‌ఫోన్‌లో ఉండాలి. ఫోన్ నుంచి సిమ్ తొలగించినా, వేర్ సిమ్ మార్చినా, సిమ్ డీయాక్టివేట్ అయినా వెంటనే యాప్ సర్వీసులను కంపెనీలు నిలిపివేయాల్సి ఉంటుంది.
అదే సిమ్ మళ్లీ స్మార్ట్‌ఫోన్‌లో పెడితే మెస్సేజింగ్ సేవలు తిరిగి పొందవచ్చు. గతంలో సిమ్ వేరే ఫోన్‌లో ఉన్న ఓటీపీతో లాగిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు.
గతంలో సిమ్ వేరే ఫోన్‌లో ఉన్నా వైఫై సాయంతో యాప్స్ ఉపయోగించుకునేవారు. ఇప్పుడు బ్యాంక్ యాప్స్ తరహాలో హార్డ్ వేర్ లెవల్ సెక్యూరిటీని అమలు చేయనున్నారు. అలాగే వాట్సప్ వెబ్ వెర్షన్లపై కూడా ఈ ప్రభావం పడనుంది.
ఇకపై వాట్సవ్ వెబ్ వెర్షన్ ప్రతీ 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతుంది. మళ్లీ వినియోగదారులు ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రీలాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రీస్కాన్ చేసి అథెంటికేషన్ పూర్తి చేయాలి.
వాట్సప్, టెలిగ్రాం, సిగ్నల్, అరట్టై, జియో చాట్, షేర్ చాట్, జోష్ వంటి అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌కు ఈ రూల్స్ వర్తిస్తాయి. అయితే ఫోన్ నెంబర్‌పై ఆధారపడని కారణంగా స్నాప్ చాట్‌కు మినహాయింపు కల్పించారు.
తమ ఫ్లాట్‌ఫామ్స్‌ను సిమ్ బైండింగ్ నిబంధనలకు అనుకూలంగా మార్చేందుకు డిసెంబర్ 31 వరకు కేంద్రం గడువు ఇచ్చింది. దీంతో కంపెనీలు ఈ మేరకు తమ ఫ్లాట్‌ఫామ్స్‌లో మార్పులు చేస్తున్నాయి.