Prabhas: బర్త్ డే సందర్భంగా ప్రభాస్ మూవీస్ పై ఫుల్ క్లారిటీ
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్‌కమింగ్ సినిమాల లైనప్‌పై ఆసక్తి పెరిగింది. ‘కల్కి 2’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాల పనులను సమాంతరంగా కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’ షూటింగ్‌ను ఈ మూడు సినిమాల్లో ఏదో ఒకటి పూర్తయిన తర్వాత ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి భారీ ప్రాజెక్టుల ఒత్తిడి పడకుండా, ప్రతి సినిమాకు తగిన సమయం కేటాయించడమే ఈ ప్రణాళిక వెనుక ఉద్దేశంగా ప్రచారం జరుగుతోంది.
పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను శాసిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా డార్లింగ్ అప్‌కమింగ్ మూవీస్ లైనప్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. చేతిలో అరడజనుకు పైగా భారీ ప్రాజెక్టులతో యమా బిజీగా ఉన్న ప్రభాస్.. ఏ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లాలన్న విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ లైనప్ ఎలా ఉండబోతుందనే విషయంలో ఫ్యాన్స్‌లో రకరకాల కన్ఫ్యూజన్స్ ఉండేవి. అయితే డార్లింగ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ వేళ ఈ సినిమాల షూటింగ్ అప్డేట్స్పై స్పష్టత వచ్చింది. బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం యూరప్ వెళ్లిన ప్రభాస్.. అక్కడి నుంచి తిరిగి రాగానే నెక్స్ట్ వీక్ నుంచే కల్కి 2 సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ కల్కి 2తో పాటే.. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రాబోతున్న హై-వోల్టేజ్ కాప్ డ్రామా స్పిరిట్ సినిమాల వర్క్‌ను కూడా ప్యారలల్‌గా కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మూడు డిఫరెంట్ జానర్లలో తెరకెక్కుతున్న ఈ సినిమాల కోసం ప్రభాస్ తన లుక్స్ అండ్ డేట్స్‌ను పక్కాగా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. సలార్ 2: శౌర్యాంగ పర్వం విషయంలోనూ డార్లింగ్ ఒక డెసిషన్‌కు వచ్చారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఫౌజీ, కల్కి 2, స్పిరిట్.. ఈ మూడింట్లో ఏదో ఒక మూవీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే సలార్ 2ను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు. ఒకేసారి నాలుగు భారీ యాక్షన్ సినిమాల భారం పడకుండా, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే
రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!
రుద్రాక్షలో ప్రభాస్ ఫొటో.. కుప్పంలో అభిమాని కళా నైపుణ్యం
తక్కువ ఛార్జీకే రాపిడో బైక్ ఎక్కాడని...ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్

