AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Storage: ఫ్రిజ్‌తో పనిలేదు.. ఇలా స్టోర్‌ చేస్తే వారమైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!

మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే కూరగాలు ఎక్కవ రోజులు ఫ్రెష్‌గా ఉండాలని చాలా మంది వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ ఇంట్లో ఫ్రిజ్‌ లేకపోతే.. లేదా కరెంట్ లేకపోతే వాటిని తాజాగా ఎలా ఉంచాలో చాలా మందికి తెలియదు. కాబట్టి ఫ్రిజ్‌తో పని లేకుండా గది ఉష్ణోగ్రత వద్దే కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఎలా ఉంచుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 24, 2026 | 10:03 PM

Share
అన్ని కూరగాయలనూ ఒకే విధంగా నిల్వ చేయడం సరైన పద్ధతి కాదు. కొన్నింటిని చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలో ఉంచాలి, మరికొన్నింటికి మంచి గాలి వెలుతురు అవసరం. తేమ శాతం కూడా కూరగాయల తాజాదనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు మొదటగా ఏ కూరగాయలను ఎక్కడ నిల్వ చేయాలో తెలుసుకోవాలి.

1 / 5
బంగాళాదుంపలు, ఉల్లిపాయలు: బంగాళాదుంపలు, ఉల్లిపాయలను నిల్వ చేయడానికి సాధారణంగా ఫ్రిజ్ అవసరం లేదు.వీటిని పొడిగా, చీకటిగా, మంచి గాలి తగిలే ప్రదేశంలో ఉంచినా సరిపోతుంది. కానీ స్టోర్ చేసినప్పుడూ ప్లాస్టిక్ కవర్లలో కాకుండా గాలి ఆడే బుట్టలు లేదా నెట్ బాస్కెట్లులో వీటిని పెట్టాలి. అయితే ఈ రెండింటినీ ఎప్పుడూ కలిపి ఉంచకూడదు. వాటి నుంచి వెలువడే తేమ, వాయువులు రెండూ త్వరగా కుళ్లిపోయేలా చేస్తాయి. కాబట్టి వీటిని విడివిడిగా ఉంచడమే ఉత్తమం.

2 / 5
ఇక టమాటాలు.. మీ దగ్గర బాగా పండిన టమాటాలు ఉంటే వాటిని సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయవచ్చు. నేరుగా ఎండ తగిలే చోట గానీ, గ్యాస్ పొయ్యి దగ్గర గానీ కాకుండా వంటింట్లో చల్లగా, పొడిగా ఉండే చోట ఉంచాలి. టమాటాల మీద బరువు పెట్టడం గానీ, నొక్కడం గానీ చేయకూడదు. ఎందుకంటే ఒత్తిడికి గురైతే అవి త్వరగా పాడైపోతాయి.

3 / 5
ఆకుకూరలను ఎలా భద్రపరచాలి?: కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు వేడి, అధిక తేమ వల్ల చాలా త్వరగా వాడిపోతాయి. కాబట్టి మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పాడైపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను వేరు చేసి.. ఆ తర్వాత వాటిని శుభ్రమైన కాటన్ గుడ్డలో గానీ, పేపర్‌లో గానీ కాస్త తేమ తగిలేలా చుట్టి, మంచి గాలి ఆడే ప్రదేశంలో ఉంచాలి.

4 / 5
అయితే ఎప్పుడూ కూడా ఆకుకూరలను మూసి ఉన్న ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు. ఎందుకంటే లోపల అధిక తేమ పేరుకుపోయి ఆకులు త్వరగా కుళ్లిపోతాయి, కాబట్టి వాటికి గాలి తగిలేలా చూసుకోవడం ముఖ్యం. మీరు కూడా ఫ్రిజ్‌లో ప్లేస్‌  సరిపోనప్పుడూ ఈ చిట్కాలు ఉపయోగించి కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోండి.

5 / 5
Follow Us
ఇలా స్టోర్‌ చేస్తే వారమైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!

ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను

నిప్పులకొలిమిలా మంచు ఖండం.. యూరప్ అంతటా ఆగమాగం..

రోజూ వాడే కిచెన్ కత్తి ఎలా ఉండాలి? కొనేముందు ఈ విషయాలు తెలసుకోండి

భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.

దువ్వుకుంటే గుప్పెడు జుట్టు వస్తోందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త

విలేజ్ స్టైల్ కోడి పులావ్.. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ..

మళ్లీ జన్మంటూ ఉంటే సుమ లాంటి బిడ్డ పుట్టాలి..

పట్టభద్రుల ఓట్ల వేట.. ప్రచారంతో కాంగ్రెస్ దూకుడు.. అభ్యర్థులపై..