ఆరు నెలలు నేలను తాకకుండా.. ఆకాశంలోనే ఉండే పక్షి తెలుసా?
samatha
17 November 2026
Pic credit - Pinterest
ప్రకృతి మనకు ఆశ్చర్యం కలిగించే ఎన్నో వింతలను తన ఓడిలో దాచి పెట్టింది. ఈ భూ ప్రపంచం మీద అనేక రకాల, రంగుల వింతైన పక్షులు ఉన్నాయి.
ప్రకృతి
అందులో కొన్ని ఎగిరేవి ఉంటే, కొన్ని నేలపై మాత్రమే ఉండేవి ఉన్నాయి. ఇంకొన్ని నేలపై ఉంటూ, ఆకాశంలో కూడా ఎగురుతూ ఉంటాయి.
ఎగిరేవి, నేలపై ఉండేవి
అయితే ఒక పక్షి మాత్రం ఆరు నెలలపాటు నేలను తాకకుండా కేవలం ఆకాశంలోనే గాల్లో ఎగురుతూ ఉంటుందంట. ఇంతకీ అది ఏ పక్షి అంటే?
ఆకాశంలో ఉండే పక్షి
ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కామన్ స్విఫ్ట్ పక్షి. ఈ పక్షి ఏకంగా 10 నెలల పాటు భూమిని తాకకుండా నిరంతరాయంగా ఆకాశంలోనే జీవించగలదు.
కామన్ స్విఫ్ట్ పక్షి
కామన్ స్విఫ్ట్ పక్షులు గాల్లోనే ఆహారాన్ని సేకరిస్తాయి. గంటకు 112 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ, తమ నోటిని వలలా తెరిచి, గాలిలో తేలియాడే కీటకాలను పట్టుకుని తింటాయి.
112 కిలోమీటర్ల వేగం
నీళ్లు తాగడానికి నదుల పైనుంచి తక్కువ ఎత్తులో ఎగురుతూ ముక్కుతో నీటిని తాకుతాయి, లేదా వర్షపు నీటి బిందువులను పట్టుకుంటాయి.
నీళ్లు తాగడం
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇవి గాల్లోనే నిద్రపోతాయి. తమ మెదడులో సగం భాగాన్ని మాత్రమే నిద్రపుచ్చి, మరో సగంతో బ్యాలెన్స్ చేసుకుంటూ గాల్లో గ్లైడ్ అవుతాయి
గాల్లో నిద్రపోవడం
యూరప్‌లో చలికాలం కీటకాలు తగ్గగానే, వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్రికాకు వలస వెళ్తాయి. సంతానోత్పత్తి కోసం మాత్రమే గుడ్లు పెట్టడానికి ఎత్తైన భవనాలు లేదా కొండచరియల సందుల్లో గూడు కట్టి, రెండు నెలలు అక్కడే గడుపుతాయి
యూరప్
పిల్లలు రెక్కలు రాగానే, మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయి తమ విచిత్ర జీవితాన్ని కొనసాగిస్తాయి. కామన్ స్విఫ్ట్ నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతం.