అక్టోబర్ 25 రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా ఊరట.. మీ రాశికి ఎలా ఉందంటే..?
Horoscope Today (October 25, 2026): ఆదివారం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మరికొందరికి వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఒత్తిడి తగ్గడం, కొత్త అవకాశాలు లభించడం వంటి పరిణామాలు ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉండనున్నాయి? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఆదివారం రాశిఫలాలను తెలుసుకోండి.

దిన ఫలాలు (అక్టోబర్ 25, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్ని విధాలుగానూ అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో చేపట్టిన కొన్ని మార్పులు, చేర్పులు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. వ్యక్తిగత విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. కొందరు మిత్రుల తీరు ఆందోళన కలిగిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్ని విధాలుగానూ అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలకు లోటుండకపోవచ్చు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవు తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. సోదరులతో వివాదం సమసిపోతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పరవాలేదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. చేపట్టిన పనులు విజ యవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాల్ని సాధిస్తారు. ఆదాయానికి లోటుండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో ఒకటి రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని విధంగా రాబడి పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయానికి లోటుండదు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు ఆర్థిక సహాయం చేయడం కూడా జరుగు తుంది. స్నేహితుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. ఆరోగ్యం అన్నివిధాలా అనుకూలిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలకు, కొత్త కార్యక్రమాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో మీ పనితీరు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభి స్తుంది. బంధువుల్లో మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రారం భించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో తొందర పడి మాట్లాడడం మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగాపురోగమిస్తాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందు తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఎదురుచూస్తున్నశుభవార్తలువింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రత్యేకతను నిరూపించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందు తాయి. చేపట్టిన పనులు అవరోధాలు లేకుండా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్ప టికీ, సకాలంలో బాధ్యతలను నిర్వర్తించగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ బాగా పెరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. అదనపు ఆర్థిక ప్రయత్నాలు కొద్దిగా మందగిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో మీ పని తీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశిం చిన పురోగతి సాధిస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెడతారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలతో ముందుకు వెడతారు. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లోనే కాక, ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవు తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలతో పురోగమి స్తాయి. ఆస్తికి సంబంధించిన క్రయ విక్రయాల్లో లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. చేప ట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
Also Read: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..12 రాశులకు వారఫలాలు
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి



