AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి.. ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే షాక్ అవుతారు!

భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయ లేనిది ఏ కూర సంపూర్ణమవ్వదు. కారంగా ఉండే పచ్చిమిర్చిని చాలామంది కేవలం రుచి కోసమే తింటుంటారని భావిస్తారు. కానీ, నిపుణుల ప్రకారం పచ్చిమిర్చిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువు తగ్గించే దివ్యౌషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. నిత్యం ఆహారంలో పరిమితంగా పచ్చిమిర్చి చేర్చుకోవడం వల్ల లభించే విశేష ప్రయోజనాలు ఇవే:

Jyothi Gadda
|

Updated on: Oct 04, 2026 | 6:23 PM

Share
పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే ప్రధాన రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి, జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కేలరీలు మరియు కొవ్వు త్వరగా కరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహజసిద్ధమైన ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తుంది.

1 / 5
వీటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను సులభతరం చేయడంలో పచ్చిమిర్చి సమర్థవంతంగా పనిచేస్తుంది. నిత్యం ఆహారంలో మితంగా పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

2 / 5
పచ్చిమిర్చిలో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు..మధుమేహంతో బాధపడేవారికి పచ్చిమిర్చి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.

3 / 5
పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసి, రక్తపోటును నియంత్రించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, మలబద్ధకం సమస్యను నివారించడానికి ఇది తోడ్పడుతుంది.

4 / 5
పచ్చిమిర్చి తినడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను ఉత్సాహంగా ఉంచుతాయి. అలాగే విటమిన్ సి చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. పచ్చిమిర్చి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనప్పటికీ, అతిగా తింటే కడుపులో మంట, అసిడిటీ లేదా అల్సర్ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి రోజువారీ ఆహారంలో మితంగా తీసుకోవడమే శ్రేయస్కరం.

5 / 5
Follow Us
శెనగపప్పు మటన్ కూర.. మన తాతలు బలంగా ఉన్నారంటే ఇలాగే

రూ.250 కోట్ల లాటరీ గెలిచిన యువకుడు.. ఆ డబ్బుతో ఏం చేశాడంటే?

కాశీలో మరణించాలనే కోరిక ఎందుకు? మోక్షంపై ఉన్న పురాతన విశ్వాసం ఇదే

ఇలా స్టోర్‌ చేస్తే వారమైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!

ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను

నిప్పులకొలిమిలా మంచు ఖండం.. యూరప్ అంతటా ఆగమాగం..

రోజూ వాడే కిచెన్ కత్తి ఎలా ఉండాలి? కొనేముందు ఈ విషయాలు తెలసుకోండి

భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.

దువ్వుకుంటే గుప్పెడు జుట్టు వస్తోందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త