AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో మళ్లీ వర్షాలు.. వచ్చే 3 రోజులు ఎక్కడెక్కడ పడతాయో తెలుసుకోండి..

Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వాతావరణం మారనుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

Andhra Pradesh: ఏపీలో మళ్లీ వర్షాలు.. వచ్చే 3 రోజులు ఎక్కడెక్కడ పడతాయో తెలుసుకోండి..
Andhra Pradesh Weather Update
Krishna S
|

Updated on: Oct 04, 2026 | 2:41 PM

Share

ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మన్నార్ గల్ఫ్, దక్షిణ తీర తమిళనాడు ప్రాంతాల మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత తమిళనాడు, ఉత్తర కేరళ మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసరాల్లో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం ఈ ద్రోణిలో విలీనమైంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో నిన్నటివరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.

ప్రాంతాల వారీగా వాతావరణ వివరాలు

కోస్తాంధ్ర – యానాం

ఆదివారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. సోమవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మంగళవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురవవచ్చు. ఈ మూడు రోజుల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి.

రాయలసీమ

రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారులు హెచ్చరించారు.

Follow Us
అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఏ రోజులు మంచివి?..
అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఏ రోజులు మంచివి?..
ఏపీలో మళ్లీ వర్షాలు.. వచ్చే 3 రోజులు ఎక్కడెక్కడ పడతాయో..
ఏపీలో మళ్లీ వర్షాలు.. వచ్చే 3 రోజులు ఎక్కడెక్కడ పడతాయో..
భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత
భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత
Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్
Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అద్దిరిపోయిన శర్వానంద్ 'భోగి' టీజర్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి.. పగిలిన కిటికీల అద్దాలు
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..
ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న సినిమా..