భాగ్యనగరంలో ఉత్సాహంగా పింక్ విక్టరీ రన్ 2026.. లైవ్ వీడియో
మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌లో ‘పింక్ విక్టరీ రన్ 2026’ నిర్వహించారు. రోటరీ సంస్థ, మెడికవర్ హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2, 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో రన్ ఏర్పాటు చేశారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం..
హైదరాబాద్: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో భాగ్యనగరంలో ‘పింక్ విక్టరీ రన్ 2026’ (Pink Victory Run 2026) ఘనంగా ప్రారంభమైంది. రోటరీ సంస్థ, మెడికవర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవగాహన పరుగును నిర్వహిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా ఈ పింక్ విక్టరీ రన్ ను.. 2, 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరవ్వనున్నారు. క్యాన్సర్‌ను ముందస్తుగానే గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలు, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై సమాజంలో విస్తృత చైతన్యం తీసుకురావడమే ఈ రన్ ప్రధాన ఉద్దేశం. నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పౌరులు, వైద్యులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ రన్లో పాల్గొని ఉత్సాహంగా అడుగులు వేశారు.
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
