AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ పేదలకు పట్టాభిషేకం అనే కార్యక్రమం కింద కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా గుంటూరు జిల్లా వేదికగా 3లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం.. రాష్ట్ర ప్రజలకు మరో గుడ్‌న్యూస్ తెలిపారు. వీటి నిర్మాణం పూర్తైన వెంటనే.. మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు స్పష్టం చేశారు.

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
Cm Chandrababu Foundation Stone For 3 Lakh Homes In Burripalem
Anand T
|

Updated on: Oct 04, 2026 | 6:35 PM

Share

రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ 2029 నాటికి వంద శాతం పక్కా ఇళ్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ఆదివారం నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారు కుటుంబంతో కలిసి భూమిపూజ చేసి, వారికి నూతన వస్త్రాలు అందజేశారు.

మరో 9లక్షల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రానికి సాధారణ కోటా కింద 75 వేల ఇళ్లు మాత్రమే కేటాయించగా, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు కేంద్రం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఈ నిర్మాణాలు పూర్తయ్యేలోగా మరో 3 లక్షలు, వచ్చే ఏడాది ఇంకో 3 లక్షల ఇళ్లు మంజూరు చేయడానికి కేంద్ర మంత్రి అంగీకరించారని, మొత్తంగా 9 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.

కూటమి ప్రభుత్వంలోనే పేదలకు లబ్ధి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 6 లక్షల పేదల ఇళ్లను రద్దు చేసి, నివాసయోగ్యం కాని స్థలాలను ఇచ్చారని విమర్శించిన ఆయన.. తమ ప్రభుత్వం ఏళ్లనాటి భూ సమస్యలను పరిష్కరించి విశాఖ, విజయవాడ, మంగళగిరి సహా వివిధ ప్రాంతాల్లో పేదలకు రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను అందజేసిందని గుర్తుచేశారు.

షైనింగ్ ఆంధ్రా: కేంద్రమంత్రి

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ మాట్లాడుతూ.. విజనరీ నేత చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ‘షైనింగ్ ఆంధ్రా, అడ్వాన్స్‌‌డ్ ఆంధ్రా, అచీవింగ్ ఆంధ్రా’గా ఎదుగుతోందని కొనియాడారు. పేదల సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

దేశానికే రోల్ మోడల్‌గా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టు

అంతకుముందు, బుర్రిపాలెంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (CBRI), రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ.14 కోట్లతో చేపట్టిన 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టును నేతలు పరిశీలించారు. కేవలం 10 రోజుల్లోనే పటిష్టమైన ఇంటిని నిర్మించే ఈ నూతన సాంకేతికత దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని కేంద్ర మంత్రి ప్రశంసించారు. అనంతరం వేదికపై లక్ష్మి అనే మహిళకు సీఎం, కేంద్ర మంత్రి ఇంటి పట్టాను అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..