చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది భయ్యా.. అందాల బీభత్సమే..
Rajitha Chanti
Pic credit - Instagram
25 August 2026
తెలుగు చిత్రం ‘దృశ్యం’లో విక్టరీ వెంకటేష్, మీనాల చిన్న కుమార్తెగా నటించి మెప్పించిన ఎస్తర్ అనిల్ అందరికీ సుపరిచితమే. ఆ సినిమాలో చిన్న పాపగా, అమాయకపు నటనతో ప్రేక్షకులను అలరించింది.
ఈ క్యూట్ బ్యూటీ ఇప్పుడు పెద్దదై, సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో సందడి చేస్తోంది. తాజాగా ఎస్తర్ అనిల్ ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకున్న సారీ లుక్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కాటన్ చీరలో మెగా బ్లౌజ్ ధరించి ఎంతో ట్రెడిషనల్‌గానూ, అదే సమయంలో గ్లామరస్‌గానూ కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ‘దృశ్యం’ సినిమాలో చూసిన చిన్న పాపయేనా ఈమె అని ఆశ్చర్యపోతున్నారు.
తన రూపంతో అందరినీ ముగ్ధులను చేస్తోంది. ఎస్తర్ అనిల్ పోస్ట్ చేసిన ఈ స్టన్నింగ్ లుక్స్ చూసి నెటిజన్లు, అభిమానులు "చాలా అందంగా ఉన్నావు" అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.
2010లో 'నల్లవన్' అనే మలయాళ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఎస్తర్, 2013లో వచ్చిన 'దృశ్యం' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తన లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఆ తర్వాత మలయాళంతో పాటు తెలుగు, తమిళ, 'దృశ్యం 2'లో నటించి ప్రశంసలు అందుకుంది. 2016లో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ బాల నటిగా అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ప్రస్తుతం కథానాయికగా అవకాశాలు దక్కించుకునేందుకు ఎస్తర్ అనిల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తాజాగా వైరల్ అయిన ఈ చీరకట్టు ఫొటోలు ఆమెకు సోషల్ మీడియాలో మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.