AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall Solution: లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్! మినాక్సిడిల్ అసలు నిజాలివే!

విపరీతమైన జుట్టు రాలడం, బట్టతల, తీవ్రమైన చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారా? ఖరీదైన బయోటిన్ గమ్మీస్, పీఆర్‌పీ (PRP) ట్రీట్‌మెంట్స్ నిజంగా పనిచేస్తాయా? ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మౌనిత గారు తెలిపిన సైంటిఫిక్ హెయిర్ కేర్ నిజాలు, మినాక్సిడిల్ వాడకం, చుండ్రు నివారణ పద్ధతుల పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

Phani CH
|

Updated on: Aug 25, 2026 | 8:48 PM

Share
 ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులిద్దరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య విపరీతమైన జుట్టు రాలడం మరియు చుండ్రు. మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, బయోటిన్ గమ్మీస్ లేదా సెలూన్లలో వేలకు వేలు ఖర్చుపెట్టి చేయించుకునే హెయిర్ స్పా, పీఆర్‌పీ ట్రీట్‌మెంట్ల వల్ల నిజంగానే ఫలితం ఉంటుందా? అసలు జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి? ఈ విషయాలపై సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మౌనిత గారు విలువైన వైద్య సలహాలు అందించారు.

1 / 5
బయోటిన్ గమ్మీస్ భ్రమ మాత్రమే: మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముడవుతున్న బయోటిన్ గమ్మీస్ పూర్తిగా వేస్ట్ అని, అవి కేవలం షుగర్ సిరప్‌తో చేసిన ఉత్పత్తులేనని డాక్టర్ స్పష్టం చేశారు. రోజుకు అవసరమైన 30 మైక్రోగ్రాముల బయోటిన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, విటమిన్ బి12 లోపాలను రక్తపరీక్ష ద్వారా గుర్తించి మాత్రమే డాక్టర్ పర్యవేక్షణలో సప్లిమెంట్లు తీసుకోవాలి. వీటన్నింటికంటే ముందు ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, క్యారెట్, బీట్‌రూట్, గుడ్లు, పన్నీర్, గింజలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడమే ప్రాథమిక చికిత్స.

2 / 5
బట్టతలకు మినాక్సిడిల్ పాత్ర: వంశపారపర్యంగా వచ్చే బట్టతలకు 'మినాక్సిడిల్' ఒక వరం లాంటిదని డాక్టర్ పేర్కొన్నారు. ఇది స్కాల్ప్‌పై రక్తప్రసరణను పెంచి జుట్టు తిరిగి పెరిగేలా చేస్తుంది. బీపీ, షుగర్ రోగులు జీవితాంతం మందులు వాడినట్లే, జన్యుపరమైన బట్టతల నివారణకు మినాక్సిడిల్ రెగ్యులర్ వాడకం అవసరం. అయితే తలలో తీవ్రమైన చుండ్రు, దురద లేదా విటమిన్ల లోపం ఉంటే మినాక్సిడిల్ కూడా పనిచేయదు; ముందు వాటిని డెర్మటాలజిస్ట్ వద్ద క్లియర్ చేసుకోవాలి.

3 / 5
పీఆర్‌పీ (PRP) ట్రీట్‌మెంట్స్ ఎప్పుడు పనిచేస్తాయి: గుత్తులు గుత్తులుగా జుట్టు రాలుతున్నప్పుడు నేరుగా పీఆర్‌పీ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. హెయిర్ ఫాల్ అదుపులోకి వచ్చి, డాక్టర్ సూచించిన మెడిసిన్స్ వాడుతూ అదనపు గ్రోత్ కోసం మాత్రమే పీఆర్‌పీ, మైక్రోనీడ్లింగ్ వంటివి ఉపయోగపడతాయి.

4 / 5
చుండ్రు నివారణ & హెయిర్ ఆయిల్స్ వాడకం: చుండ్రు అనేది 'సెబోరిక్ క్యాపిటిస్' అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. చుండ్రు ఉన్నప్పుడు తలకు నూనె రాసి మసాజ్ చేస్తే ఫంగస్‌కు ఆహారం దొరికి చుండ్రు పదింతలు పెరుగుతుంది. కాబట్టి చుండ్రు ఉన్నవారు ఆయిల్ వాడకాన్ని తగ్గించి సరైన యాంటీ-ఫంగల్ లోషన్లు, షాంపూలు వాడాలి. చుండ్రు లేనివారు మాత్రమే తలస్నానానికి 2-3 గంటల ముందు నూనె రాసుకుని కండిషనింగ్‌గా వాడుకోవాలి.

5 / 5
Follow Us
లాగినా రాలని ఒత్తైన జుట్టు కోసం డెర్మటాలజిస్ట్ సీక్రెట్ టిప్స్

అదృష్టం అంటే ఇదే.. పూజ బంగారం కాలువలో దొరికింది..

సాంగ్ అంటే ఇది.. నెట్టింట దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.

కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే

అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..

బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్

అతి ఆలోచనకు చెక్ పెట్టి.. మనశ్శాంతిగా జీవించడం నేర్పించే కథ!

పర్సనల్ లోన్ మీకు ఎంత వస్తుంది..? ఈజీగా చెక్ చేసుకోండి

బాడీ షేమింగ్‌ కామెంట్ కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన దేశ ప్రధాని