అక్కాచెల్లెళ్ల కోసం రూ.1000 బడ్జెట్‌లో అదిరిపోయే రాఖీ గిఫ్ట్స్!

25 August 2026

Anand T

మీ చెల్లి లేదా అక్కతో కలిసి మీరు సంతోషంగా గడిపిన క్షణాల ఫోటోలతో కస్టమైజ్ చేసిన కాఫీ మగ్ ఇవ్వండి దీ ధర రూ.200 నుంచి రూ.500 మధ్య ఉంటుంది.

పర్సనలైజ్డ్ ఫోటో మగ్

మీ తోబుట్టువులు కాలేజీ లేదా ఆఫీస్‌లకు వెళ్తుంటే వారి నేమ్‌తో ఉన్న ఓ వాటర్ టంబ్లర్ ఇవ్వండి. ఇవి వాళ్లకు కచ్చితంగా నచ్చుతుంది. దీని ధర రూ.400 వరకు ఉంటుంది అంతే.

పర్సనలైజ్డ్ వాటర్ టంబ్లర్

అంతేకాదు అందమైన రాఖీతో పాటు ఫోటో మగ్ వచ్చే కాంబో ప్యాక్‌ను కూడా మీరు గిఫ్ట్‌గా ఇవ్వచ్చు దీని ధర రూ.600 వరకు ఉంటుంది,

రాఖీ, మగ్ కాంబో

మీ తోబుట్టువుకు ఇష్టమైన చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్‌తో నిండిన ఓ కష్టమైస్‌డు గిఫ్ట్ హాంపర్‌ను ఇవ్వండి. ఇవి అమ్మాయిలకు ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటాయి. దీని ధర రూ.1000 వరకు ఉండొచ్చు.

చాక్లెట్ హాంపర్

అక్కాచెల్లెళ్ల కోసం వారి పేరు ముద్రించిన  కాంపాక్ట్ జ్యువెలరీ బాక్స్ ఇవ్వండి. ఇది వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీని ధర రూ.400 వరకు ఉండొచ్చు.

జ్యువెలరీ ఆర్గనైజర్ బాక్స్

మీ రిద్దరు గడిపిన చిలిపి, ఆనందమైన జ్ఞాపకాలు, సరదా ఫోటోలతో కూడిన ఈ పాప్-అప్ బాక్స్‌ను ఇవ్వండి ఇది వారికి  మంచి సర్‌ప్రైజ్ ఇస్తుంది. ఆ ఫోటోస్ చూసినప్పుడు మీరే గుర్తొస్తారు. దీని ధర రూ.300 వరకు ఉండొచ్చు.

ఫోటో పాప్-అప్ బాక్స్

మీ అనుబంధాన్ని గుర్తుచేసే ఒక మంచి ఫోటోను అందమైన ఫ్రేమ్‌లో పెట్టి మీ చెల్లి లేదా అక్కకు బహుమతిగా ఇవ్వండి. ఇది వారికి జీవితాంతం జ్ఞాపకం ఉండిపోయే గిఫ్ట్ అవుతుంది. దీని ధర రూ.6 నుంచి 7 మధ్య ఉంటుంది.

కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్

మీ అక్కా లేదా చెల్లి ఎక్కవగా బ్యూటీ ప్రాడక్ట్స్ ఇష్టపడితే వారికి స్కిన్‌కేర్, బాడీ కేర్ లేదా గ్రూమింగ్ ప్రొడక్ట్స్ ఉండే కిట్‌ గిఫ్ట్‌గా ఇవ్వండి ఇది ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. దీని ధర రూ.500 నుంచి రూ.1000 మధ్య ఉంటుంది.

బ్యూటీ హాంపర్

మీ అక్కా లేదా చెల్లి ఆఫీస్‌కు వెళ్తుంటే.. వారికి ఓ మంచి సువాసననిచ్చే ట్రావెల్ సైజ్ పర్ఫ్యూమ్ సెట్స్ ఇవ్వండి. దీని ధర కూడా రూ.1000 వరకు ఉండొచ్చు. ఈ గిఫ్ట్‌లు మీ అక్కా చెల్లెలకు మంచి గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవుతాయి. 

పర్ఫ్యూమ్స్ సెట్