ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్.. అయినా పట్టించుకోని టాలీవుడ్..

Rajitha Chanti

Pic credit - Instagram

04 August 2026

ఈమధ్యకాలంలో టాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన చిత్రాలలో ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ముఖ్యమైనవి. ఈ రెండు సినిమాల్లో నటించింది తేజస్వి..

ఈ సినిమాలతో వరుస విజయాలను అందుకుని, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు భామ తేజస్వి. దీంతో తెలుగులో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది ఈ అమ్మడు.

ఇటీవల ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గ్లామర్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యా్న్స్. 

సినిమాల బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్న తేజస్వి, ఇటీవల ఒక సరదా వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ తను గడిపిన ఆహ్లాదకరమైన క్షణాలను బంధించారు. 

ఈ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. వెకేషన్ మోడ్‌లో ఉన్న తేజస్వి షార్ట్ డ్రెస్సుల్లో ఎంతో స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతూ, విభిన్నమైన ఫోజులతో దిగిన ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. 

బాబోయ్.. వెకేషన్‌లో తేజస్వి లుక్ అదిరిపోయింది, చాలా క్యూట్‌గా, స్టైలిష్‌గా ఉంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్ అండ్ కాన్ఫిడెన్స్ ఆమె లుక్ ఆకట్టుకుంటుంది.

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్న ఈ భామ, కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.