AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..

ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల కలల రాకుమారి. 16 ఏళ్లకే కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఫస్ట్ మూవీతోనే హిట్టు అందుకుని.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. ఇప్పుడు ఆమె 5 కంపెనీలకు, 2000 కోట్ల రూపాయల ఆస్తికి యజమాని. ఆమె ఎవరో తెలుసా? ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..
Rambha
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2025 | 8:00 AM

Share

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఆమె 90’s మూవీ లవర్స్ కలల అమ్మాయి. 15 ఏళ్ల వయసులో మలయాళంలో అరంగేట్రం చేసింది. అదే సమయంలో తెలుగులోనూ నటించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రంభ. 1992లో వినీత్ సరసన “సర్గం” చిత్రంలో నటించింది. అదే సమయంలో తెలుగులో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటించింది. తమిళంలో “ఉజవన్” చిత్రంతో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.

కథానాయికగానే కాకుండా స్పెషల్ పాటలతోనూ అలరించింది. 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ ను వివాహం చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రంభ.. ఇప్పుడిప్పుడే పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరించింది. ఇప్పటివరకు రంభ సినిమాల్లో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. రంభ భర్త పెద్ద వ్యాపారవేత్త. అతడు ఇంటి ఇంటీరియర్లకు ప్రసిద్ధి చెందిన మ్యాజిక్ వుడ్స్ కంపెనీకి డైరెక్టర్. ఇంద్రకుమార్ మొత్తం 5 కంపెనీలను నడుపుతున్నారు. వీటిలో కొన్ని కంపెనీలు చెన్నైలో పనిచేస్తున్నాయి. ఆయన 2000 కోట్ల రూపాయల ఆస్తికి యజమాని అని సమాచారం. రంభ భర్త శ్రీలంకలో యుద్ధ బాధిత విద్యార్థుల విద్యలో మార్పు తీసుకురావడానికి విద్యా సంస్థలను స్థాపించారు. అలాగే వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి కొన్ని ఐటీ కంపెనీలను సైతం స్థాపించారు.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

Rambha News

Rambha News

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..