AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో అలాంటివి చేస్తే సహించను.. కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ గ్రాండ్ లాంఛింగ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ రియాలిటీ షోపై వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ కు సంబంధించి కంటెస్టెంట్లకు నాగ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Bigg Boss Telugu 10: ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో అలాంటివి చేస్తే సహించను.. కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Aug 05, 2026 | 6:13 PM

Share

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 ప్రోమో షూట్‌ను నాగార్జున పూర్తి చేశారు. ప్రోమో షూట్ అద్భుతంగా జరిగిందని నాగార్జున తెలిపారు. పదో సీజన్ కావడంతో ఈసారి షోను మరింత గ్రాండ్‌గా, కొత్త కాన్సెప్ట్‌లతో రూపొందిస్తున్నామని కింగ్ చెప్పారు. ‘ గత కొన్నేళ్లుగా ఈ షోను హోస్ట్ చేయడం మంచి అనుభవంగా ఉంది. తొలి రెండు సీజన్లలో షో ఫార్మాట్‌కు అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. ఇతరుల ప్రవర్తనను నిర్ణయించడం, వారికి సూచనలు చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈసారి మరింత ఎంటర్‌టైనింగ్‌గా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఈ సీజన్‌లో ఫిజికల్ టాస్కులు మరింత కఠినంగా ఉండనున్నాయి. కంటెస్టెంట్లు హద్దులు దాటి, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదు. బిగ్‌బాస్ విశేషాలతో పాటు నా 100వ సినిమా గురించి కూడా త్వరలో మరిన్ని విషయాలు వెల్లడిస్తాను’ అని నాగ్ చెప్పుకొచ్చారు.

గత సీజన్ లాగే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇందుకోసం త్వరలోనే అగ్ని పరీక్ష సీజన్ 2ను లాంచ్ చేయనున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ అలియాస్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణీ.. ఇలా చాలా మంది సెలబ్రిటీల పేర్లు నెట్టింట చక్కర్లు వస్తున్నాయి. మరి వీరిలో ఎవరు వస్తారో అన్నది తెలియాలంటే బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ దాకా వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

కాగా త్వరలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రారంభం కానుంది. ఇక దీని తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ ఉండనుంది. అయితే ఈసారి పదో సీజన్ కావడంతో మొదట కేవలం పది కంటెస్టెంట్లతోనే బిగ్ బాస్ రియాలిటీ షోను నిర్వహించనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..
డయాబెటిస్, అధిక బరువును ఇట్టే తగ్గించే సూపర్‌ఫుడ్..
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్