Cinema : ప్రపంచంలోనే పరమ చెత్త సినిమా ఇది.. 800 కోట్లు పెడితే 100 కోట్లే వచ్చాయి.. నిర్మాతలకు షాకిచ్చిన మూవీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా గురించి మీకు తెలుసా.. ? దాదాపు రూ.857 కోట్లతో నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద కేవలం 132 కోట్లు కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా రికార్డ్ ఎవరూ అందుకోలేకపోయారు. నిర్మాతలకు దారుణంగా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా పేరు ఏంటో తెలుసా.. ? అయితే మీరు ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే.

ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా.. ? ప్లాప్ అవుతుందా అనేది ముందే ఊహించడం కష్టం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే అత్యధిక పెట్టుబడితో నిర్మించిన సినిమా ఊహించని విధంగా అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా అధిక బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. దాదాపు 857 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.132 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లాప్ సినిమా కట్‌త్రోట్ ఐలాండ్. 2 గంటల 4 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 1995లో విడుదలైంది. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయి 30 సంవత్సరాలు.
ఇవి కూడా చదవండి : Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాప్ సినిమాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లాప్ చిత్రం బడ్జెట్ రూ. 857 కోట్లు. కానీ రూ.132 కోట్లు వసూలు చేసింది. రెన్నీ హార్లిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీనా డేవిస్, మాథ్యూ మోడిన్, ఫ్రాంక్ లాంగెల్లా, మౌరీ చైకిన్ కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
ఈ మూవీకి IMDbలో 5.7 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా ఈ మూవీని చూడొచ్చు. ఈ సినిమా కథ.. ఒక మహిళా పైరేట్ , ఆమె సహచరుడి చుట్టూ తిరుగుతుంది. అనేక మంది సవాళ్లను ఎదుర్కొంటూ నిధి ద్వీపం కోసం వెతుకుతుంటారు. ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాలేదు.
ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..








