AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..

ప్రస్తుతం కుర్ర భామలకు గుబులు పుట్టిస్తోంది ఓ సీనియర్ హీరోయిన్. వయసుతో సంబంధమే లేకుండా చేతినిండ సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళం భాషలలో చక్రం తిప్పుతుంది. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ ఒక్కో సినిమాకు కోట్లలో వసూలు చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్లలో ఆమె ఒకరు.

Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..
Trisha
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2025 | 5:39 PM

Share

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె టాప్ హీరోయిన్. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. 42 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తుంది. అంతేకాదు.. ఒక్కో సినిమాకు దిమ్మతిరిగే పారితోషికం తీసుకుంటుంది. ఆమె ఎవరంటే.. త్రిష. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్. దాదాపు 20 ఏళ్లుగా సినిమా ప్రపంచంలో చక్రం తిప్పుతుంది. మిస్ చెన్నై అందాల పోటీలో విజేతగా నిలిచిన ఈ అమ్మడు.. ఆ తర్వాత నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత కథానాయికగా వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగులో వర్షం సినిమాతో ఆమె కెరీర్ టర్న్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ అభిమానులకు ఆశ్చర్యపరుస్తుంది. ఈ వయసులోనూ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిషకు నిశ్చితార్థం జరగ్గా… వీరి బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఇక కొన్ని రోజుల క్రితం ఆమె స్టార్ హీరో విజయ్ దళపతితో ప్రేమలో ఉందంటూ రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ ఈ రూమర్స్ పై త్రిష స్పందించలేదు.

ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో స్టార్ హీరోలకు జోడిగా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..