AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి మరో సీరియల్ బ్యూటీ కన్ఫామ్.. ఇక ఆట రచ్చ రచ్చే..

బిగ్‏బాస్ రియాల్టీ షో సందడి మొదలైంది. ఇప్పటికే కామన్ మ్యాన్ కేటగిరిలో భాగంగా అగ్నిపరీక్ష దాదాపు పూర్తి కావొచ్చింది. అభిజిత్, బింధుమాధవి, నవదీప్ జడ్జిలుగా, యాంకర్ శ్రీముఖి హోస్టింగ్ తో అగ్నిపరీక్ష సాగుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతున్నాయి. తాజాగా మరో సీరియల్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి మరో సీరియల్ బ్యూటీ కన్ఫామ్.. ఇక ఆట రచ్చ రచ్చే..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2025 | 2:51 PM

Share

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షో సందడి మొదలైంది. ఇప్పటికే మలయాళం, హిందీ భాషలలో ఈ షో స్టార్ట్ కాగా.. త్వరలోనే తెలుగులో బిగ్‏బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు జరిగిన 8 సీజన్లకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు త్వరలోనే స్టార్ట్ కాబోయే సీజన్ 9 కంటెస్టెంట్స్ పై రోజుకో చర్చ నడుస్తుంది. కొన్నాళ్లుగా బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ పలువురు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా, సీరియల్ సెలబ్రెటీలతోపాటు సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్లను సైతం ఎంపిక చేయనున్నారని ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది తారల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ పేరు నెట్టింట మారుమోగుతుంది. ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. నిజానికి కన్నడకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్క సూపర్ హిట్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆమె మరెవరో కాదండి.. ముద్ద మందారం సీరియల్ ఫేమ్ తనూజ గౌడ.

ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..

ఇవి కూడా చదవండి

బిగ్‏బాస్ హౌస్ లోకి ప్రతి సంవత్సరం సీరియల్ సెలబ్రెటీస్ రావడం కామన్. గత సీజన్ లో కన్నడ బ్యూటీస్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఇక ఇప్పుడు ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తనూజ గౌడను తీసుకువస్తున్నారు. బుల్లితెరపై తన అందం, అభినయంతో కట్టిపడేసింది తనూజ. ముద్ద మందారం సీరియల్ తర్వాత మరో సీరియల్ చేయలేదు. చాలా కాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇప్పుడిప్పుడే తిరిగి టీవీ అడియన్స్ ముందుకు వస్తుంది. తనూజ కర్ణాటకకు చెందిన అమ్మాయి.. కానీ ఒక్క సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ హృదయాలను దొచుకుంది.

ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..

ఈ సీరియల్ మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో కథానాయికగానూ నటించింది. కానీ ఈ అమ్మడుకు సినిమాలతో అంతగా గుర్తింపు రాలేదు. ఎక్కువగా సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ముద్ద మందారం తర్వాత నాగ భైరవి సీరియల్ చేసిన ఆమె.. ఆ తర్వాత కన్నడలో పలు సీరియల్స్ చేసింది. ఇక ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 9లో ఈ అమ్మడు సందడి చేయనుందని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ బ్యూటీ ఇన్ స్టా పోస్టలకు కంగ్రాస్ట్, ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..

ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..