AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jatadhara: జటాధర సినిమాలో ఒకప్పటి క్రేజీ హీరోయిన్.. భయపెడుతోన్న స్టార్ హీరో మరదలు.. ఎవరో గుర్తు పట్టారా?

తెలుగు, హిందీ, తమిళ్ సినిమాల్లో ఒక వెలుగు వెలిగిందీ అందాల తార. అయితే ఎందుకో గానీ సడెన్ గా సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఒక పవర్ ఫుల్ రోల్ తో..

Jatadhara: జటాధర సినిమాలో ఒకప్పటి క్రేజీ హీరోయిన్.. భయపెడుతోన్న స్టార్ హీరో మరదలు.. ఎవరో గుర్తు పట్టారా?
Jatadhara Movie
Basha Shek
|

Updated on: Aug 28, 2025 | 6:36 PM

Share

టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న కొత్త సినిమా జటాధర. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్ కుసుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జటాధర చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. శోభ అనే పాత్రను ఆడియెన్స్ కు పరిచయం చేశారు. ఈ పోస్టర్ లో ఆమె నల్ల చీర కట్టుకుని హోమం ముందు కూర్చొని నాలుక బయటపెట్టి భయంకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఈ పోస్టర్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్.. అంతే కాదు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతోన్న ఓ స్టార్ హీరో మరదలు కూడా. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్, మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్. గతంలో పలు బాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె తెలుగులో బ్రహ్మ అనే సినిమాలో యాక్ట్ చేసింది. అయితే పెళ్లై, పిల్లలయ్యాక ఇండస్ట్రీకి దూరమైంది. సుమారు 13 ఏళ్ల తర్వాత హిందీ బిగ్ బాస్ సీజన్ తో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. దీని తర్వాత మళ్లీ శిల్పకు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పుడు జటాధర సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. తాజాగా రిలీజైన పోస్టర్ ను బట్టి ఈ మూవీలో శిల్ప నెగెటివ్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

జటాధర సినిమాలో శిల్పా శిరోద్కర్..

నమ్రత, సితారలతో శిల్పా శిరోద్కర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.