Tollywood: ఒకప్పుడు హోటల్‌లో సర్వర్.. ఇప్పుడు దక్షిణాదిలో బిజియెస్ట్ యాక్టర్.. కోట్లలో ఆస్తులు.. ఎవరంటే?
చాలా మంది లాగే ఈ నటుడు కూడా సినిమాల్లోకి రాక ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పొట్ట కూటి కోసం హోటల్ లో సర్వర్ గా పనిచేశాడట. ఇంటి అద్దె చెల్లించడం కోసం ఇంకా ఎన్నో చిన్నా చితకా పనులు కూడా చేశాడట.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో గతంలో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న వారే. పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు చేసిన వారే. ఈ దక్షిణాది నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. తమిళనాడులోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఈ నటుడు జన్మించాడు. పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత చెన్నైలోని లయోలా కాలేజీలో ఇంటర్ కంప్లీట్ చేశాడు.అదే సమయంలో సినిమాలపై మక్కువ ఉండడంతో ఆ దిశగా తన ప్రయాణం సాగించాడు. కానీ ఆర్థికంగా సరైన ప్రోత్సాహం అందలేదు. అందుకే ఆకలి తీర్చుకోవడం కోసం హోటల్ లో సర్వర్ గా పని చేశాడు. అలాగే ఇంటి అద్దె చెల్లించడం కోసం చిన్న చితకా పనులు కూడా చేశాడు. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తన గమ్యాన్ని మాత్రం మర్చిపోలేదు. తన ప్రతిభతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దక్షిణాదిలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ది మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్లలో ఇతను కూడా ఒకరు. అందుకే తన డిమాండ్, క్రేజ్ కు తగ్గట్టుగానే ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు. పవన్ కల్యాన్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి సంచలనం సృష్టించిన ఆ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ మరెవరో కాదు ఎస్ జే సూర్య.
1999లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ‘వాలి’ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఎస్ జే సూర్య. ఆ తర్వాత దళపతి విజయ్ తో కలిసి బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ తెరకెక్కించాడు. ఇదే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ తో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మహేష్ బాబుతో నాని లాంటి ప్రయోగాత్మక సినిమాను తీసి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత సూర్య కెరీర్ కొంచెం స్లో అయ్యింది. కానీ నటుడిగా మళ్లీ బౌన్స బ్యాక్ అయ్యాడు. విలన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు.
అలనాటి అందాల తారలతో ఎస్ జే సూర్య..
View this post on Instagram
ఆ మధ్యన నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీలో ఎస్ జే సూర్య పోషించిన విలనిజం ఓ రేంజ్ లో పండింది. అందులో అతను పోషించిన సైకో పోలీస్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఆడకపోయినా సూర్య యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ స్టార్ యాక్టర్.
పవన్ కల్యాణ్ తో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








