- Telugu News Photo Gallery Cinema photos Know About Rashmika Mandanna Net Worth and Remuneration Details
Rashmika Mandanna : అటు వరుస హిట్లు.. ఇటు క్యూ కట్టిన ఆఫర్స్.. రష్మిక సంపాదన తెలిస్తే మైండ్ బ్లాంకే..
ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వరుస హిట్లతో జోష్ మీదుంది.
Updated on: Aug 28, 2025 | 9:10 PM

ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ రష్మిక మందన్నా. అలాగే అటు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా మారింది. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సంపాదన గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తుంది.

1996లో జన్మించిన రష్మిక మందన్నా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కిరిక్ పార్టీ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది.

తెలుగులో గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, హిందీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో వరుస హిట్లు అందుకుంది.

ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు. నివేదికల ప్రకారం ఇప్పుడు రష్మిక ఆస్తులు రూ.50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.

ఇటీవలే ఛావా, కుబేర చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవలే మైసా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది. రష్మిక వద్ద రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి.



