- Telugu News Photo Gallery Cinema photos Do You Remember This Heroine, After Defeating Cancer, Now This Is How It Is.. She is Hamsanandini
Actress: ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. క్యాన్సర్‌ను జయించి ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఒక్క సినిమాతోనే ఒకప్పుడు కుర్రాళ్ల మనసు దొచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. కానీ అనుహ్యంగా క్యాన్సర్ భారిన పడి చాలా కాలం చికిత్స తీసుకుంది. ఇప్పుడు క్యాన్సర్ ను జయించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
Updated on: Aug 28, 2025 | 8:39 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో తనదైన ముద్రవేసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ అమ్మడు.. క్యాన్సర్ సమస్యతో పోరాటం చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఆమె మరెవరో కాదు హీరోయిన్ హంసానందిని. ఒకటవుదాం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత ఆర్యన్ రాజేశ్ నటించిన అనుమానాస్పదం సినిమాతో హిట్టు అందుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత తెలుగులో అధినేత, అహా నా పెళ్లంటా వంటి చిత్రాల్లో నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే రామయ్యా వస్తావయ్యా, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాల్లో కనిపించింది.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది హంసానందిని. చాలా కాలం పాటు కీమోథెరపీ చికిత్స తీసుకుని క్యాన్సర్ నుంచి కోలుకుంది. గతంలో ఇదే సమస్యతో ఆమె తల్లి మరణించింది.

క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.



