- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor Ganesh Chaturthi Celebrations At Manish Malhotra Home, See Photos
Janhvi Kapoor: వినాయక చవితి వేడుకల్లో జాన్వీ.. ముక్కపుడకతో జూనియర్ శ్రీదేవి ఎంత అందంగా ఉందో చూశారా? ఫొటోస్
దేశవ్యాప్తంగా గణపతి చతుర్ధి వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. కొన్ని చోట్ల 3 రోజులు, మరికొన్ని చోట్ల 5 రోజులు, ఇంకొన్ని చోట్ల 9 రోజుల పాటు గణేశుడు పూజలు అందుకోనున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎంతో ఉత్సాహంగా గణేశుడి వేడుకల్లో పాల్గొంటున్నారు.
Updated on: Aug 28, 2025 | 10:32 PM

దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ వినాయకుడికి పూజలు చేసింది.

ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్‌మల్హోత్రా ఏర్పాటు చేసిన గణేష మంటపంలో జాన్వీ కపూర్ పూజలు చేసింది. ఆ తర్వాత హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి విఘ్న నాయకుడిని దర్శించుకుంది.

ఈ సందర్భంగా కొన్ని అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది జాన్వీ కపూర్. ఇందులో చక్కని చీర కట్టు, ముక్కు పుడకతో ఎంతో అందంగా కనిపించింది జూనియర్ శ్రీదేవి.

కాగా జాన్వీ కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా పరమ్ సుందరి. తుషార్ జలోటా డైరెక్షన్ లో దినేష్ విజన్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కేరళ అమ్మాయిగా అభిమానులను అలరించనుంది జాన్వీ కపూర్. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్ , ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక దేవర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన జాన్వీ ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి పెద్ది అనే సినిమాలో నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.




