- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor Rides High on Telugu Success, But Bollywood Debut Still a Gamble
Janhvi Kapoor: క్షణ క్షణం.. భయం భయం.. జాన్వీ కపూర్ ఏమైంది
టెన్షన్‌తో నిద్ర పట్టకపోవడం.. బీపీలు పెరిగిపోవడం.. క్షణక్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్.. ఇవన్నీ ఇప్పుడు జాన్వీ కపూర్‌లో కనిపిస్తున్నాయి. అంత పెద్ద కష్టం ఏమొచ్చిందబ్బా అనుకుంటున్నారు కదా..? ఉంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కష్టాల్లోనే ఉంది అతిలోకసుందరి కూతురు. ఇంతకీ జాన్వీని కంగారు పెడుతున్న ఆ విషయమేంటి..?
Updated on: Aug 28, 2025 | 10:13 PM

తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. కానీ కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్. దేవర సినిమాలో తంగం పాత్రతో బాగానే చేరువయ్యారు ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నారు.

బాలీవుడ్ కంటే తెలుగులోనే ఈ భామకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పెద్దితో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరిపోవాలని చూస్తున్నారు జాన్వీ. తెలుగులో ఎలా ఉన్నా.. హిందీలో మాత్రం ఇప్పటికీ స్ట్రగ్లింగ్ స్టేజ్‌లోనే ఉన్నారు జాన్వీ.

అక్కడ ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు దాటినా.. ఇప్పటికీ ఒక్క హిట్ అంటూ వేచి చూస్తూనే ఉన్నారు జాన్వీ. గుంజన్ సక్సేనా, రూహీ లాంటి ఒకటి రెండు సినిమాలు పేరు తెచ్చాయి కానీ స్టార్ హీరోయిన్ హోదా మాత్రం తీసుకురాలేదు.

ప్రస్తుతం ఈ భామ ఆశలన్నీ పరమ్ సుందరిపైనే ఉన్నాయి. ఆగస్ట్ 29న పరమ్ సుందరి విడుదల కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళీ అమ్మాయిగా నటించారు జాన్వీ.

బాలీవుడ్‌లో ఈమె కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది పరమ్ సుందరి. అందుకే తన కెరీర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ వీకెండ్ ఇదే అంటున్నారు జాన్వీ. మరి ఆగస్ట్ 29న పరమ్ సుందరితో జాన్వీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.




