- Telugu News Photo Gallery Cinema photos Kriti Shetty's Career From Uppenna to Glamor Roles A Comeback Strategy
Krithi Shetty: ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించిన కృతి శెట్టి.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా ??
ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది నాకు అంటూ ఓ డైలాగ్ ఉంటుంది కదా..! కృతి శెట్టికి ఇప్పుడిది బాగా సూటవుతుంది. కొన్నాళ్లుగా హిట్స్‌కి దూరంగా ఉన్న బేబమ్మ.. జాతకం మార్చుకోవడం కోసం ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయిందా..? ఆఫర్స్ క్యూ కడుతున్నాయా..? గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం కలిసొస్తుందా లేదా..?
Updated on: Aug 28, 2025 | 10:10 PM

టైటిల్‌కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునేలోపే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది.

కానీ అంతలోనే టైమ్ టర్న్ అయింది.. వరసగా ఫ్లాపులొచ్చాయి. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది.

తెలుగులో కృతికి ఆఫర్స్ నిల్.. ఇక్కడ మనమే తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయారు. ఇదే సమయంలో తమిళ, మలయాళం నుంచి మాత్రం ఈమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి.

మలయాళంలో ARM సినిమాతో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కృతి.. తమిళంలోనూ కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు.ఒకప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే గ్లామర్ షో చేసిన కృతి శెట్టి... ఇప్పుడు సినిమాల్లోనూ మొదలు పెట్టారు.

విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న LIKలో కృతి గ్లామర్ ప్రధానాకర్షణ. అలాగే వా వాతియార్‌లోనూ ఫుల్లుగా అందాలను ఆరబోస్తున్నారు బేబమ్మ. ఇక సోషల్ మీడియాలో చెప్పనక్కర్లేదు.. మొత్తానికి అందమే ఆయుధంగా దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ.




