- Telugu News Photo Gallery Cinema photos Allu Ayaan Arha Vinayaka Chavithi Pooja With Allu Aravind, See Photos
Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. తాతయ్యతో కలిసి అర్హ, అయాన్ పూజలు.. ఫొటోస్ ఇదిగో
దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు అట్టహాసంగా జరుగుతున్నాయి. పలువురు సినిమా తారలు ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. తమ ఇంట్లోనే గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
Updated on: Aug 28, 2025 | 11:15 PM

టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. చాలా మంది తమ ఇళ్లల్లోనే గణపతి విగ్రహాలు ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొందరు తమ ఇళ్లకు సమీపంలో ఉన్న వినాయక మండపాలకు వెళ్లి పూజలు చేశారు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున ఇంట్లోను గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భార్య స్నేహలతా రెడ్డి, కుమారుడు అయాన్, కూతురు అర్హ సంప్రదాయ దుస్తులు ధరించి ముస్తాబయ్యారు.

ఇంట్లో ప్రతిష్ఠించిన గణేశుడికి తాతయ్య అల్లు అరవింద్ తో కలిసి పూజలు నిర్వహించారు అల్లు అయాన్, అర్హ. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియలో షేర్ చేసింది స్నేహా రెడ్డి.

ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.


కాగా వరుణ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ తో ఓ హారర్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు.




