- Telugu News Photo Gallery Cinema photos From Debut to Diva: How Tollywood Heroines Transformed Over the Years
Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్లు డెబ్యూట్ చిత్రాల సమయంలో ఎలా ఉన్నారో చుడండి…!
నేచురల్‌గానే ప్రతి మనిషి వయసు పెరిగే కొద్దీ రూపం, ప్రవర్తన, ఆలోచనలు అన్నీ మారుతాయి. చిన్ననాటి నుండి యవ్వన దశ వరకు, ఆపై 25–30 ఏళ్లు దాటాక ప్రతి ఒక్కరిలోనూ గమనించదగ్గ మార్పులు కనిపిస్తాయి. అయితే ఈ మార్పులు సినీ రంగంలో అడుగుపెట్టిన హీరోయిన్ల విషయంలో మరింత వేగంగా, స్పష్టంగా కనబడతాయి. కెరీర్ ప్రారంభంలో చాలా సహజంగా, సాధారణ రూపంలో కనిపించే హీరోయిన్… కొద్దికాలంలోనే 20–30 సినిమాలు చేసిన తరువాత పూర్తిగా కొత్త రూపంతో, కొత్త స్టైల్‌తో కనిపిస్తారు. స్క్రీన్ మీద ఉండే ప్రెషర్, గ్లామర్‌కు తగ్గట్టుగా మేకోవర్ అవసరం, అలాగే ఆడియెన్స్ అంచనాలు – ఇవన్నీ వాళ్లలో భారీ మార్పులను తీసుకొస్తాయి.
Updated on: Aug 29, 2025 | 8:23 AM

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్‌లో నాగచైతన్య నటించిన ఏ మాయ చేశావో సినిమాతో సమంత ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సమంత జెస్సీ పాత్రలో నటించింది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో సమంత నటన, సహజమైన అందం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చింది, సమంతకు తెలుగు సినీ పరిశ్రమలో స్థిరమైన స్థానం ఇచ్చింది. మంతకి ఉత్తమ నటి (Filmfare Award for Best Debut – South) అవార్డు కూడా వచ్చింది.

2004లో విడుదలైన క్యూ! హో గయా నా సినిమా ద్వారా చిన్న రోల్‌లో తొలిసారి కాజల్ నటించింది. ఇక్కడ అసలు హీరోయిన్ మాత్రం ఐశ్వర్యా రాయ్, కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. 2007లో లక్ష్మీ కల్యాణం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ సినిమాతో కాజల్‌ను తెలుగు ఆడియన్స్ గమనించారు కానీ పెద్దగా హిట్ కాలేదు. అదే ఏడాది చందమామ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అక్కడి నుండి కాజల్ కెరీర్ టర్నింగ్ పాయింట్ మొదలైంది.

1999లో విడుదలైన జోడిలో త్రిష ఒక చిన్న రోల్ చేసింది. అది హీరోయిన్ కాకుండా చిన్న గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే. 2002లో వచ్చిన మౌనం పెసియధే (తమిళ్ సినిమా)లో హీరో సూర్య సరసన నటించింది. ఇదే ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేసిన అసలైన తొలి సినిమా. ఈ సినిమా ద్వారా త్రిషకు మంచి గుర్తింపు వచ్చింది. 2003లో విడుదలైన వర్షం త్రిషకు తెలుగు ఇండస్ట్రీలో బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో త్రిష టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా నిలిచింది.

అనుష్క 2005లో వచ్చిన తెలుగు సినిమా సూపర్ ద్వారా వెండితెరకి అడుగుపెట్టింది. ఈ సినిమా దర్శకుడు పురి జగన్నాథ్. ఇందులో నాగార్జున హీరో, ఆయేషా టకియా మరో హీరోయిన్‌గా నటించారు. అనుష్క ఇందులో సాషా అనే మోడర్న్ అండ్ గ్లామరస్ రోల్ చేసింది. ఆ సమయంలో కొత్తదనం ఉన్న లుక్‌తో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నయనతార 2003లో మలయాళంలో వచ్చిన “మనసినక్కరే” అనే సినిమాతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోగా జయరామ్ నటించారు. ఇందులో నయనతార గీత అనే సింపుల్, సాంప్రదాయబద్ధమైన అమ్మాయి పాత్రలో నటించింది. ఆ క్యూట్ లుక్స్, నేచురల్ యాక్టింగ్‌తోనే ఆమె మొదటి సినిమాకే మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తమన్నా భాటియా 15 ఏళ్ళ వయసులోనే చాంద్ సా రోశన్ చెహ్రా అనే బాలీవుడ్ సినిమాతో వెండితెరకి పరిచయమైంది. ఇందులో ఆమె ఒక టీనేజ్ లవ్ స్టోరీలో హీరోయిన్‌గా నటించింది. మొదటి సినిమాకే తమన్నా తన ఫ్రెష్ లుక్స్, ఎక్స్‌ప్రెసివ్ యాక్టింగ్‌తో దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.బాలీవుడ్‌లో మొదలుపెట్టినా, అసలు గుర్తింపు మాత్రం సౌత్ సినిమాల ద్వారానే వచ్చింది. 2005లోనే తెలుగులో శ్రీ సినిమా, ఆ తర్వాత హ్యాపీ డేస్ (2007), తమిళంలో కల్లూరి (2007) సినిమాల ద్వారా స్టార్‌డమ్ అందుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ ప్రయాణాన్ని కన్నడ సినిమా గిల్లితో ప్రారంభించింది. ఈ సినిమా 2004లో వచ్చిన తమిళ ఘిల్లీకి రీమేక్. ఈ సినిమాలో రకుల్ హీరోయిన్‌గా ప్రధాన పాత్ర పోషించింది. అప్పటికి ఆమె మోడలింగ్ చేస్తూ, కాంట్రాక్ట్స్ కూడా చేసేది. సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా, రకుల్‌కి అవకాశాలు వచ్చాయి. తెలుగులో కేరింత (2015), వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (2013) వంటి సినిమాలతో మంచి బ్రేక్ దక్కించుకుంది. అలా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది.

ప్రేమమ్ సినిమాలో మేరీ జార్జ్ అనే స్కూల్‌గర్ల్ పాత్రలో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది అనుపమ. ఈ సినిమాలో నేచురల్‌గా కనిపించిన ఆమె అందం, క్యూట్‌నెస్ ఒక్కసారిగా యూత్‌ని ఆకట్టుకుంది. ప్రేమమ్ బ్లాక్‌బస్టర్ కావడంతో అనుపమ ఒక్క సినిమాతోనే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. అదే ప్రేమమ్ సినిమా తెలుగు రీమేక్‌లోనూ (2016) నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత అ ఆ, శతమానం భవతి వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది.




