- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actors With Private Jets Worth Crores, know the details
Tollywood: కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌లున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా..
టాలీవుడ్‌లోని చాలా మంది ప్రముఖ నటులు సొంత ప్రైవేట్ విమానాలను కలిగి ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల దగ్గర ప్రైవేట్ జెట్ వాహనాలు ఉన్నట్లు సమాచారం. వీరు తమ సినిమా ప్రమోషన్ల సమయంలో చేసే ప్రయాణాల కోసం మాత్రమే కాదు.. కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా తమ ప్రైవేట్ జెట్‌లను ఉపయోగిస్తారు.
Updated on: Aug 29, 2025 | 11:29 AM

కారు కొనడం అనేది సామాన్యులకు ఒక కల. అయితే సినీ స్టార్ హీరోల పరిస్థితి భిన్నం.. ప్రతి సినిమాకు కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. కోట్లాది రూపాయలను సంపాదిస్తారు. తమ సంపాదనని వివిధ రంగాలలో పెట్టుబడి పెడతారు. ఈ కారణంగా చాలా మంది స్టార్ నటుల ఆస్తులు వందల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్లకు సొంతంగా ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. వారు ఈ విమానాన్ని సినిమా ప్రమోషన్‌ల కోసం, ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు.

అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు (ఆగస్టు 29). ఆయన కుటుంబానికి సినీ పరిశ్రమతో విడదీయరాని బంధం ఉంది. తండ్రి బాటలో సిని పరిశ్రమలో అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ సొంత గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆయనకు సొంతంగా ప్రైవేట్ జెట్ ఉంది. ఆయన తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో తిరుగుతారు. ఆయన అనేక ప్రదేశాలకు అందులోనే ప్రయాణిస్తారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. చిరంజీవి దగ్గర చార్టర్ విమానం కూడా ఉంది.

చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కు ఒక ప్రైవేట్ జెట్ ఉంది. రామ్ చరణ్ ఒక ఎయిర్ లైన్స్ కూడా ప్రారంభించాడు. చిరు, చరణ్ కు ఈ ప్రైవేట్ జెట్ ను సినిమా ప్రమోషన్లకు, కుటుంబం ఎక్కడికైనా వెళ్ళడానికి దీనిని ఉపయోగిస్తారు.

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ కి కూడా సొంత జెట్ విమానం ఉంది. తన 'పుష్ప' సినిమా ప్రమోషన్ కోసం ఆయన ఇదే విమానాన్ని ఉపయోగించారు. నటి రష్మిక అందులో ప్రయాణిస్తూ తీసిన ఫోటోను షేర్ చేసింది.

మహేష్ బాబు టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న నటుడు. ఆయన సినిమాలతో పాటు తన కుటుంబానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆయన తన సొంత విమానంలో అనేక ప్రదేశాలకు తన కుటుంబంతో కలిసి ప్రయాణించారు.

నందమూరి కుటుంబ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరో. ఆ జెట్ విలువ దాదాపు ₹80 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో పార్క్ చేయబడింది.ఎన్టిఆర్ తన వ్యక్తిగ, వృత్తిపరమైన ప్రయాణాలకు ప్రైవేట్ జెట్‌ను ఉపయోగిస్తాడు.

టాలీవు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, రాజకీయాలు రెండింటిలోనూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఆయన సినీ, రాజకీయ కార్యక్రమాలల్లో పాల్గొనేందుకు ఈ విమానం ఉపయోగిస్తారని సమాచారం.




