- Telugu News Photo Gallery Cinema photos Two blockbuster movies missed in the Chiranjeevi and Nagarjuna combo
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కాంబోలో మిస్సైన రెండు బ్లాక్ బస్టర్ మూవీస్!
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉంటారు. అయితే వీరిద్దరంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వీరి కాంబోలో మూవీ వస్తే బాగుండు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పటి వరకు వీరి కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీరి కాంబోలో రెండు సినిమాలు రావాల్సి ఉండగా అవి, మధ్యలోనే ఆగిపోయాయంట. కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
Updated on: Aug 29, 2025 | 2:03 PM

టాలీవుడ్‌లో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున , మోహన్ బాబు వీరందరూ సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతూ, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే గతంలో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, శోభన్ బాబు వీరందరూ మల్టీస్టారర్ మూవీస్ చేసి మంచి విజయం అందుకున్నారు. తర్వాత బాలకృష్ణ, వెంకటేష్ వీరు కూడా చాలా మల్టీస్టారర్ మూవీస్ చేశారు.

చిరంజీవి కూడా చాలా మంది హీరోలతో మల్టీ స్టార్ సినిమాల్లో నటించి, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. కానీ ఇప్పటి వరకు నాగార్జున చిరంజీవి కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో చిరు, నాగ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో కూడా రెండు సినిమాలు రావాల్సి ఉండేనంట.

1990లో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చిరంజీవితో అల్లుడా మజాకా సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత నాగార్జునతో హలో బ్రదర్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సమయంలోనే ఆయన వీరిద్దరితో కలిసి మల్టీస్టారర్ మూవీ తీయాలని నిర్ణయించుకున్నాడంట. దీని కోసం స్క్రీప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడంట. కానీ ఈ మూవీ పట్టాలెక్కపోయింది. అలా వీరిద్దరి కాంబోలో రావాల్సిన మూవీ ఆదిలోనే అంతం అయ్యింది.

అదే విధంగా ఫేమస్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా వీరి కాంబోలో సినిమా తియ్యాలని ప్లాన్ చేశారంట.దీంతో ఒక స్క్రిప్ట్ రాసి ఇద్దరికీ కథ వినిపించాడంట. మూవీ స్టోరీ బాగుండటంతో చిరంజీవి, నాగార్జున ఇద్దరూ మూవీకి ఒకే చెప్పేశారు. ఇక ఈ మూవీలోకి అప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్యను ఎంపిక చేసుకొని, సినిమాను 10 శాతం కంప్లీట్ చేశారంట.

దీంతో మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావుకి మూవీ చిరంజీవికి తగినది కాదేమో అనిపించిందంట. ఈ విషయం నాగార్జునకు చెప్పాడంట. ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని అనిపిస్తుందని చెప్పడంతో, నాగార్జున కూడా మీకు మూవీపై నమ్మకం లేకపోతే వదిలేయడమే మంచిదని చెప్పాడంట.దీనికి చిరు కూడా ఒకే చెప్పడంతో, ఇద్దరు హీరోల అభిప్రాయంతో మూవీ ఆగిపోయిందంట. అలా మరోసారి చిరు, నాగ్ కాంబోలో మూవీ మిస్సైంది.



